తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ కృతి సనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈమె మహేష్ బాబు హీరోగా నటించిన 1నేనొక్కడినే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.
ఈమె టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా సినిమాలు నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ప్రస్తుతం సినిమాలలో నటిస్తూ బిజీబిజీగా గడుపుతోంది కృతి సనన్.ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తనక సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని పంచుకుంటూ ఉంటుంది కృతి సనన్.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె ఒక విషయాన్ని షేర్ చేసుకుంది.2018 లో వచ్చిన లవ్ స్టోరీస్ సినిమాలో నటించేందుకు అవకాశం వచ్చినా కూడా దానిని తిరస్కరించినట్లు తెలిపింది కృతి సనన్.అయితే అందుకు గల కారణాన్ని కూడా వివరించింది.అటువంటి బోల్డుసీన్ లలో నటించేందుకు తన తల్లి ఒప్పుకోదని తెలిపింది.కాగా కృతి సనన్ తిరస్కరించిన ఆ పాత్రలో అద్వాని నటించిన విషయం తెలిసిందే.అయితే మొదట కరణ్ జోహార్ కృతి సనన్ ను సంప్రదించినప్పటికీ ఆమె ఆ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించిందట.
కాగా ఇదే విషయాన్ని ఆమె ఇటీవల కాఫీ విత్ కరణ్ షోలో తెలిపింది.
ఒక ఇంటర్వ్యూలో భాగంగా కృతి సనన్ తల్లి మాట్లాడుతూ.కృతి కెరీర్ ప్రారంభంలోనే అటువంటి సన్నివేశాల్లో నటించడం నాకు నచ్చలేదు.అలాంటి బోల్డ్ సీన్లలో నటించేందుకు నా కుమార్తెను అందుకే అనుమతించలేదు అని తెలిపారు.
అనంతరం కృతి సనన్ కూడా మాట్లాడుతూ.మా అమ్మకు స్క్రిప్ట్ నచ్చకపోవడంతో ఆ పాత్రకు నో చెప్పాను.
అందుకే నేను ఆ సినిమాలో నటించకపోవడమే మంచిది అనిపించింది అని చెప్పుకొచ్చింది కృతి సనన్.