ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ రంజుగానే కనిపిస్తాయి.ఇక్కడ అధికార ప్రతిపక్షాల మధ్య సాగుతున్న వైరం చూసే వారికి వామ్మో అని అనిపిస్తుంది.ఇలా అనేక సంఘటనలు జరిగాయి.2019లో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాలు మరింత వేడెక్కాయనే చెప్పుకోవాలి.జగన్ ప్రభుత్వం ప్రధాన ప్రతిపక్షమైన మా మీద మా నాయకుల మీద కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ చాలా మంది టీడీపీ నేతలు ఇప్పటికే ఆరోపణలు చేశారు.ఇక ఈ ఆరోపణల సంగతలా పక్కకుంచితే కులాల సమీకరణాలు రాజకీయాలకు చాలా ఇంపార్టెంట్.
ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా మూడు కులాలే ప్రస్థావనకు వస్తాయి కమ్మ, కాపు, రెడ్డి.వీరిలో ఎవరికి వారే ఆధిపత్యం కోసం ఎత్తులకు పై ఎత్తులు వేస్తుంటారు.కొంత మంది విజయం సాధిస్తే కొంత మంది ఆ ఎత్తుల్లో పడి చిత్తవుతూ వస్తున్నారు.
ఇలా మొన్న అసెంబ్లీలో జరిగిన ఘటనకు టీడీపీ బహిష్కృత నేత వల్లభనేని వంశీ మాజీ సీఎం సతీమణి భువనేశ్వరికి క్షమాపణలు చెప్పాడు.
వంశీ అలా క్షమాపణలు చెప్పడానికి ప్రధాన కారణం కమ్మ కులస్తులే అనే చర్చ జరుగుతోంది.పోయిన ఎన్నికల్లో కమ్మ కులస్తుల్లో కొంత మంది జగన్ పార్టీకి మద్దతుగా నిలిచారు.
కానీ ఇప్పుడు జగన్ ప్రభుత్వం కమ్మలను అణగదొక్కుతుందని చాలా మంది ఆరోపిస్తున్నారు.

ఇలా తమ మీద ఎక్కడ వ్యతిరేకత వస్తుందో అని వంశీ భయపడి సారీ చెప్పారని పలువురు చర్చించుకుంటున్నారు.జగన్ ప్రభుత్వంలో కొడాలి నాని వంటి కమ్మ నేతలు కూడా ఉన్నారు.ఇన్ని సంవత్సరాల్లో కేవలం ఎన్టీఆర్, చంద్రబాబు వంటి కమ్మ నేతలు మాత్రమే ఆంధ్రప్రదేశ్ ను పాలించారు.
తమకు ఇప్పటి ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయడం లేదని కమ్మ కులానికి చెందిన పలువురు కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు.