కంప్యూటర్ కీ బోర్డు గురించి ఈ విషయాలు తెలుసా.. ABCDలు గజిబిజిగా ఎందుకు ఉంటాయంటే?

ఈ రోజుల్లో కంప్యూటర్‌ పరిజ్ఞానం లేనివారు దాదాపు ఉండరనే చెప్పుకోవాలి.ఎందుకంటే నేడు దైనందితజీవితంలో కంప్యూటర్‌ అనేది ఒక భాగం అయిపోయింది.

 Know These Things About Computer Keyboard Why Abcds Are Messy-TeluguStop.com

మనిషి గంటల్లో చేసేపనిని ఇది క్షణాల్లో చేస్తుంది గనుక దీనిని విరివిగా వాడుతున్నారు.ఇక టెక్నాలజీ పెరుగుతున్నకొద్ది కంప్యూటర్‌ వాడకం అనేది ఎక్కువైపోతోంది.

అయితే కంప్యూటర్‌ ఆపరేటింగ్‌లో ముఖ్యమైనది కీ బోర్డు.ఇది లేనిది కంప్యూటర్‌లో ఏ పని జరగదు.

పెన్ను పట్టి పేపర్‌పై రాయాల్సిన కాలం పోయింది.ప్రస్తుతం ఏ ఉద్యోగం చేయాలన్నా ముందుగా కంప్యూటర్‌ వచ్చి ఉండాలి.

ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానంలో కంప్యూటర్ లేనిదే పనులు జరగవు.

ప్రతి రోజు కీబోర్డుతో కుస్తీపట్టేవారు ఒక విషయం మాత్రం గమనించి వుండరు.

అందేంటంటే మనం సాధారణంగా వాడే కీబోర్డును క్వర్టీ కీబోర్డు అంటాము.కీబోర్డులో ABCDలు వరుస సంఖ్యలో ఉండకుండా A ఓక చోటు ఉంటే B మరో చోట ఉంటుంది.ఇలా కీబోర్డులోని కీస్ అన్ని కూడా గందరగోళంగా ఉంటాయి.ఇలా ఎందుకున్నాయని మీరెప్పుడైనా గమనించారా? ఇలాంటివి ఎవ్వరు కూడా పెద్దగా పట్టించుకోరు.అలా ABCDలు వరుస సంఖ్యలో కాకుండా గందరగోళంగా ఉండడానికి గల కారణం కూడా ఉంది.

Telugu Key Board, Key, Letters, Reaso, Ups-Latest News - Telugu

కీ బోర్డు పై వరుసలో ఉన్న మొదటి ఆరు అక్షరాలు Q, W, E, R, T, Y, U, I, O, P అనే లేటర్స్‌ ఉంటాయి. వాటిని కలిపేసి పలుకుతారు.ఈ తరహా కీబోర్డును 1868లో అమెరికాకు చెందిన క్రిస్టోఫర్‌ షోల్స్‌ అనే వ్యక్తి రూపకల్పన చేశారట.

అక్షరాల మీద తీవ్రమైన ఒత్తిడి లేకుండాను, ఎక్కువసార్లు వచ్చే అక్షరాలు చేతివేళ్లకు అనుకూలమైన స్థానాల్లోను ఉండేలా షోల్స్‌ తాను రూపొందించిన టైపు మిషన్‌ కీబోర్డును ‘Qwerty’ నమూనాలో చేశాడట.అంతకు ముందు A, B, C, D లాగా వరుసగా ఉన్న కీబోర్డు పై ఆయన కొన్ని ఇబ్బందులు గమనించారట.

ఎక్కువగా ఉపయోగించే కీస్‌ను బట్టి చేతివేళ్లకు అందుబాటులో ఉండే విధంగా తయారు చేశారు.ఈ కారణాలచేతనే కీ బోర్డులో ABCDలు వరుస సంఖ్యలో ఉండకుండా తారుమారుగా ఉంటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube