ఎప్పుడైతే ఈటల రాజేందర్ వ్యవహారం తెరమీదకు వచ్చిందో అప్పటి నుంచే కేసీఆర్ అప్రమత్తమయ్యారు.ఈటల దారిలో నడిచే నాయకులపై ఫోకస్ పెట్టారు.వారిని ఒక్కొక్కరిగా దగ్గరకు తీసుకుంటున్నారు.ఇదే క్రమంలో అన్నిజిల్లాల్లో పర్యటనకు కూడా చేస్తున్నారు.ప్రజల నుంచి ఈటల వ్యవహారంలో ఎలాంటి వ్యతిరేకత రాకుండా చూసకుంటున్నారు.అయితే మొన్నటి వరకు ఎలాంటి యాక్టివ్‌లో లేని కడియం శ్రీహరిపై ఇప్పుడు కేసీఆర్ ఫోకస్ పెట్టారు.
ప్రస్తుతం కడియం శ్రీహరి ఎమ్మెల్సీ పదవి గడువు ముగిసింది.ఈ నేపథ్యంలోనే ఆయన మళ్లీ ఎమ్మెల్సీ పదవి కోసం పట్టుబడుతున్నారు.ఒకవేళ ఎమ్మెల్సీ ఇవ్వకుంటే కడియం శ్రీహరి పార్టీ మారుతారనే ప్రచారం కూడా జరిగింది.అయితే ఈ నేపథ్యంలో నిన్న వరంగల్‌లో పర్యటించిన గులాబాబాస్ కేసీఆర్.
అనూహ్యంగా మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఇంటికి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.రెండోసారి అధికారంలోకి వచినప్పటి నుంచి కడియం శ్రీహరిని దూరంగా ఉంచుతున్న గులాబీ బాస్.
ఇప్పుడు అనూహ్యంగా దగ్గరకు తీసుకుంటున్నారు.
వరంగల్ ఇన్చార్జి మంత్రిగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్‌రావును కాదని మరీ కడియం ఇంటికి సీఎం కేసీఆర్ మధ్యాహ్నం భోజనానికి వెళ్లారు.అయితే సీఎం రాకతో కడియం చాలా రకరకాల వంటలతో అరుదైన విందు భోజనం ఏర్పాటు చేశారు, అన్ని రకాల డిషెస్‌తో కేసీఆర్‌ను ఆకట్టుకోవాలని ప్రయత్నించారు.మరి కడియం ఇంటికి వెళ్లడంతో కేసీఆర్ మరోసారి ఎమ్మెల్సీ ఇస్తారనే ప్రచారం ఊపందుకుంది.
అయతే కడియం బీజేపీలోకి వెళ్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే కేసీఆర్ కూడా అలర్ట్ అయినట్టు తెలుస్తోంది.ఆయనకు ఏదో ఒక పదవి ఇచ్చి పార్టీ నుంచి వెళ్లకుండా కాపాడుకోవాలని చూస్తున్నారు.
కాకపోతే మరోసారి మంత్రి వదవి ఇవ్వకపోవచ్చు గానీ ఎమ్మెల్సీ మాత్రం ఖాయతమే అన్నట్టు తెలుస్తోంది.చూడాలి మరి కడియం ప్రయత్నం ఫలిస్తుందో లేదో.