వర్షాకాలం సమావేశాల చివరి రోజు అయిన ఆదివారం సీఎం కేసీఆర్( CM KCR ) తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడారు.వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరుగుతున్న చివరి అసెంబ్లీ సమావేశాలు కావడంతో తమ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరించడానికి సీఎం కేసీఆర్ ఎక్కువ సమయం తీసుకున్నారు.
తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, సాగునీరు, తాగునీరు వ్యవసాయంతో సహా పలు కీలక అంశాలపై సుదీర్ఘ ఉపన్యాసం చేసిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం సంక్షేమ పథంలో దేశంలోనే ముందుందని చెప్పుకొచ్చారు .రైతుల రుణమాఫీ, దళిత బంధు( Dalita Bandhu ) లాంటి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని 24 గంటలు కరెంటుకూడా అందిస్తున్నామని, సంవత్సరానికి 5 వేల కోట్ల రూపాయలు నష్టం వస్తున్నా కూడా మోటార్లకు మీటర్ పెట్టని రైతు అనుకూల ప్రభుత్వమని ఇంతకుముందు ఏడు లక్షల టన్నుల యూరియా మాత్రమే వినియోగించే తెలంగాణ ప్రస్తుతం 27 లక్షల టన్నులు ఉపయోగించే స్థాయికి తెలంగాణ వ్యవసాయాన్ని పెంచామని కెసిఆర్ చెప్పుకొచ్చారు .
మళ్ళీ కాంగ్రెస్ వస్తే కరెంటు, రైతుబంధు పోతాయని ప్రజలు భయపడుతున్నారన్నారు, కాంగ్రెస్ ( Congress )చెప్తున్న రెండు లక్షల రైతు రుణమాఫీ హామీను ఎవరు నమ్మడం లేదని వ్యాఖ్యానించారు.తెలంగాణ రైతాంగానికి గాని తెలంగాణ ప్రజలకు గాని ఎటువంటి సహాయం చేయని కేంద్ర ప్రభుత్వం ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులకు మాత్రం అవార్డులు ఇస్తుందంటూ దుయ్యబట్టారు . 10 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్లు పూర్తిచేసే ధరణిని తొలగించి ఏం చేస్తారంటూ కేసిఆర్ ప్రశ్నించారు? తమ అభివృద్దే మాట్లాడుతుందని తమ అభివృద్దే తమని గెలిపిస్తుంది అని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ ఏర్పాటుకు ముందే మిషన్ భగీరథ ( Mission Bhagiratha )పేరును కన్ఫామ్ చేశామని 13 రాష్ట్రాల మరియు కొన్ని దేశాల ప్రతినిధుల మిషన్ భగీరథుని అధ్యయనం చేస్తున్నారని కెసిఆర్ చెప్పుకొచ్చారు.కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో 35 వేల చెరువులు అదృశ్యమయ్యాయి అంటూ ఫైర్ అయ్యారు ఈరోజు మిమ్మల్ని తెలంగాణ ప్రజానీకం గాని రైతాంగం గాని నమ్మే పరిస్థితుల్లో లేదని ప్రభుత్వంపై ఎన్ని ఆరోపణలు అర్థసత్యాలు చెప్పినా మీపై ప్రజలకు విశ్వసనీయత లేదంటూ కేసీఆర్ చెప్పుకొచ్చారు.