తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ తీవ్రంగా మండిపడ్డారు.కేసీఆర్ గజ్వేల్ తో పాటు కామారెడ్డిలోనూ పోటీ చేయడంపై ఆయన స్పందించారు.
అయితే ఓటమి భయంతోనే కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేస్తున్నారని తెలిపారు.
కామారెడ్డి ప్రజలపై తనకు విశ్వాసం ఉందని షబ్బీర్ అలీ వెల్లడించారు.
కేసీఆర్ ను కామారెడ్డి ప్రజలు ఓడిస్తారన్న ఆయన ముస్లిం, మైనార్టీ లీడర్ అని తనపై పోటీ చేస్తున్నారని పేర్కొన్నారు.కేసీఆర్ రెండు చోట్లా గెలవరన్న షబ్బీర్ అలీ కామారెడ్డి అభివృద్ధికి కేసీఆర్ చేసిందేమీ లేదని విమర్శించారు.
కేసీఆర్ కుట్రలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని వెల్లడించారు.