ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి భాషతో సంబంధం లేకుండా సినిమాలో కంటెంట్ ఉంటే చాలు అన్న ధోరణిలో ప్రేక్షకులు ఉన్నారు.అందుకే అన్ని భాషా చిత్రాలను ఎంతో ఆదరిస్తూ వస్తున్నారు.
ఇలా ఇతర భాష చిత్రాలకు కూడా మరొక భాషలో మంచి ఆదరణ లభించడంతో ప్రస్తుతం సినిమాలన్నీ కూడా అన్ని భాషలలో విడుదలవుతూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.ఇక సౌత్ ఇండస్ట్రీ నుంచి ఇప్పటికే తెలుగు కన్నడ భాషలలో విడుదలైనటువంటి సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నాయి.

ఇకపోతే కన్నడ చిత్ర పరిశ్రమలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న శివరాజ్ కుమార్ నటించిన వేద చిత్రం కన్నడ పరిశ్రమలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది.ఈ క్రమంలోనే ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన నేపథ్యంలో నటుడు శివరాజ్ కుమార్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ ఇంటర్వ్యూలో భాగంగా గత రెండు సంవత్సరాల నుంచి కన్నడ చిత్ర పరిశ్రమ ఎంతో ఖ్యాతి సంపాదించుకుంది.ఈ విషయం గురించి మీ స్పందన ఏంటి మీకు ఎలా అనిపించిందనే ప్రశ్న ఎదురుకాగా చాలా సంతోషంగా ఉందని తెలిపారు.తెలుగు కన్నడ చిత్ర పరిశ్రమ ఇండస్ట్రీలో ఇంత మంచి స్థానాన్ని సంపాదించుకోవడం సంతోషంగా ఉందని, పక్కా ప్రణాళికలతోనే ఇంత మంచి విజయాలను అందుకోగలుగుతున్నారని తెలిపారు.
ఇలా గట్టిగా ప్రయత్నం చేస్తేనే మన లక్ష్యాన్ని చేరుకోగలమని నా దృష్టిలో పాన్ ఇండియా స్టార్ అంటే అన్ని భాషలు మాట్లాడటం రావాలని తెలిపారు.అయితే నాకు తెలుగు అనర్గళంగా మాట్లాడటం రాదని, అనర్గళంగా మాట్లాడటం కోసం కాస్త సమయం పడుతుందని తెలిపారు.