సూపర్‌ స్టార్‌ తప్పు చేశాడు

కోలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ తన తాజా సినిమా ‘లింగ’ వల్ల నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న డిస్ట్రిబ్యూటర్ల నష్టంను భరించేందుకు రజినీ సిద్దం అయ్యాడు.

 Kamal Hassan Blames Rajinikanth-TeluguStop.com

రజినీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని తమిళ స్టార్‌ హీరోలు తప్పుబడుతున్నారు.సినిమాలో నటించామా అన్నట్లు ఉండాలి కాని, ఆ సినిమాకు నష్టం వస్తే భరించడం ఏంటని రజినీకాంత్‌ను ప్రశ్నిస్తున్నారు.

భవిషత్తులో ఇలాంటివి మళ్లీ పునరావృతం అవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రజినీ తీసుకున్న నిర్ణయాన్ని యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు.

తాజాగా ఈయన మాట్లాడుతూ… ఫెయిల్‌ అయిన సినిమాలకు డిస్ట్రిబ్యూటర్లు డబ్బులు వెనక్కు ఇవ్వాలంటూ ఈమద్య డిమాండ్‌ పెరుగుతోంది.ఇలాంటి పద్దతి సినిమా ఇండస్ట్రీకి మంచిది కాదు.

‘లింగ’ పంపిణిదారులకు రజినీ తన పారితోషికాన్ని వెనక్కు ఇవ్వడాన్ని తాను వ్యతిరేకిస్తున్నాను అన్నాడు.దీన్ని ఏ ఒక్కరు కూడా ఆమోదించరు అంటూ కమల్‌ తన సన్నిహితుడైన రజినీ కాంత్‌పైనే కామెంట్స్‌ చేశాడు.

మరి రజినీకాంత్‌ ఈ కామెంట్స్‌పై ఎలా స్పందిస్తాడనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube