రాకెట్ల దాడితో దద్దరిల్లిన కాబూల్. కాబుల్ విమానాశ్రయం రాకెట్ల దాడులతో దద్దరిల్లింది.
విమానాశ్రయం లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నట్లు తెలుస్తుంది అమెరికా జరిపిన డ్రోన్ దాడులను తాలిబన్ అధికార ప్రతినిధి జిబీహుల్లా ముజాహిదీన్ ఖండించారు.ఏకపక్ష నిర్ణయాలతో ఈ విధంగా దాడులు చేయడం సరికాదన్నారు.
అమెరికా భద్రతాదళాల ఆఫ్గాన్ నుంచి ఉపసంహరించుకోవడానికి తక్కువ సమయం ఉంది సోమవారం ఉదయం రాకెట్లు విమానాశ్రయం వైపు దూసుకొస్తున్న ట్లు ప్రత్యక్షసాక్షులు వెల్లడించారు.వీటిని క్షిపణి రక్షణ వ్యవస్థ ద్వారా కూల్చి వేసినట్లు తెలుస్తోంది.
మొత్తం ఐదు రాకెట్ల ప్రయోగించినట్లు సమాచారం పేలుడు శబ్దాలకు విమానాశ్రయంలో ఉన్నవారు భయాందోళనలతో పరుగులు పెట్టినట్లు తెలుస్తోంది.ఎయిర్ పోర్ట్ వద్ద కిలోమీటర్ల దూరంలో ఆదివారం రాకెట్ దాడి జరిగింది.
ఈ సంఘటన లోఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఎయిర్ పోర్ట్ వద్ద ఆత్మాహుతి పేలుళ్లకు పాల్పడేందుకు ఓ వాహనంలో ముష్కరులు రావడాన్ని గమనించిన అమెరికా భద్రతా బలగాలు డ్రోన్ దాడి ద్వారా ముట్టపెట్టారు.

అమెరికా భద్రతా దళాలు ఉపసంహరణ మంగళవారంతో ముగియనుంది.అఫ్గాన్ ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు ప్రముఖ మత గురువు ‘మౌల్వి మహమ్మద్ సర్దార్ జాద్రాన్‘ ను తమ స్వాధీనంలోకి తీసుకున్నారు.మేరకు ఓ ఫోటో విడుదల చేశారు.అమెరికాతో కలిసి బ్రిటన్ ఆఫ్గాన్ పై దండెత్తి ఏమీ సాధించలేక పోయింది.ఈనెల 31లోగా అమెరికా బ్రిటన్ దళాలు ఉపసంహరించుకోకపోతే తీవ్ర పర్యవసానాలు ఉంటాయని తాలిబన్లు హెచ్చరించిన నేపథ్యంలో రెండు రోజుల ముందే బ్రిటిష్ సైనిక దళాలన ఖాళీ చేసింది.