చిరంజీవితో గొడవలపై నోరు విప్పిన జీవితా రాజశేఖర్.. అలా దూరం పెరిగిందంటూ?

టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ గురించి మనందరికీ తెలిసిందే.ఒకప్పుడు ఎన్నో సినిమాలలో నటించి హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకున్నారు.

 Jeevitha Rajasekhar Says Shekar Will Touch Every Heart, Jeevitha Rajasekhar, Raj-TeluguStop.com

ఇకపోతే రాజశేఖర్ తాజాగా నటించిన చిత్రం శేఖర్.ఈ సినిమాకు రాజశేఖర్ భర్త జీవిత రాజశేఖర్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

అలాగే ఇందులో జీవితా రాజశేఖర్ కుమార్తె శివాని రాజశేఖర్ కూడా నటించింది అన్న విషయం తెలిసిందే.వంకాయలపాటి మురళీకృష్ణ సమర్పణలో పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఐంపెక్స్ ఐపీఎల్, త్రిపుర క్రియేషన్స్ పతాకంపై, బీరం సుధాకర్ రెడ్డి శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ అలాగే వెంకట శ్రీనివాస్ బొగ్గరం ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు.

ఇకపోతే ఈ సినిమా దేశవ్యాప్తంగా మే 20న విడుదల కానున్న విషయం అందరికీ తెలిసిందే.ఈ సందర్భంగా ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ జీవిత రాజశేఖర్ మీడియాతో ముచ్చటించారు.

ఈ క్రమంలోనే పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.ఈ సందర్భంగా జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ.

కొన్ని అనుకోని పరిస్థితులవల్ల నేను దర్శకురాలిగా మారాల్సి వచ్చింది.తమిళంలో సూపర్ హిట్ అయిన శేషు సినిమాను తెలుగు లో ఉన్నది ఉన్నట్టుగా కథను మార్చకుండా తీయాలి అనుకున్నప్పటికీ అలా చేయడానికి ఏ డైరెక్టర్ ముందుకు రాకపోవడంతో ఆ సినిమాకు నేను దర్శకత్వం వహించాల్సి వచ్చింది అని తెలిపారు.

Telugu Chiranjeevi, Rajashekar, Tollywood-Movie

తాను దర్శకురాలిగా అది తన మొదటి సినిమా అని చెప్పుకొచ్చింది జీవిత రాజశేఖర్.మలయాళంలో సూపర్ హిట్ జోసఫ్ సినిమాను తెలుగులో శేఖర్ పేరుతో రీమేక్ చేసి తెరకెక్కించాము.అయితే పలాస సినిమా డైరెక్టర్ కరుణ కుమార్ నీలకంఠ ను కలవగా వారు బిజీగా ఉండటంతో నేను ఈ సినిమాకు డైరెక్ట్ చేశాను అని చెప్పుకొచ్చింది జీవిత రాజశేఖర్.మనసున్న ప్రతి ఒక్కరికి ఈ సినిమా నచ్చుతుంది అని తెలిపింది.

అదే విధంగా వారి ఫ్యామిలీకి ఎవరితో ఎటువంటి ఇష్యూలు లేవని, కానీ చిరంజీవిగారితో ఎప్పుడో జరిగిన విషయాన్ని రిపీట్ చేస్తూ యూట్యూబ్ వారే థంబ్ నెయిల్ పెట్టి మరి మా మధ్య ఇంకా దూరాన్ని పెంచుతున్నారు అని చెప్పుకొచ్చింది జీవిత రాజశేఖర్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube