తెలంగాణలో మరో రాజకీయ సమరానికి వేదికయింది.నాగార్జున సాగర్ ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే అన్ని పార్టీలు తమ వ్యూహ ప్రతివ్యూహాలకు పదును పెడుతున్నాయి.అయితే వరుస ఎన్నికల్లో ఓటమి పాలవుతున్న కాంగ్రెస్ కు నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది.
అయితే తనకు ఎవరు ప్రచారం చేయాల్సిన అవసరం లేదని చెప్పిన జానా రెడ్డి ఆ తరువాత టీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో దూసుకపోతున్న తరుణంలో ఇక తనకు ప్రచారం చేయాలని జానా కాంగ్రెస్ నేతలను కోరినా ఇప్పుడు వారు అంతగా ఆసక్తి కనబరచటం లేదట.
ఇక ఇదే అదునుగా టీఆర్ఎస్ మరింతగా ప్రజల్లోకి చొచ్చుకపోతున్నారు.
కాంగ్రెస్ నేతల వైఖరితో జానారెడ్డిలో ఓటమి భయం మొదలైందని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది.ఇప్పటి వరకు జానాను అసలు సిసలైన ప్రత్యర్థిగా భావించిన టీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల ప్రచార వైఖరితో కాంగ్రెస్ ను లైట్ తీసుకుంటున్నారట.
అయితే కాంగ్రెస్ నాయకులు సైతం అంటే సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇలా కాంగ్రెస్ సీనియర్ నేతలు ప్రచారం చేస్తున్నా ప్రచారంతో టీఆర్ఎస్ తమకేమీ నష్టం లేదన్నట్లుగా భావిస్తుందట.మరి కాంగ్రెస్ ప్రచారంతో నైనా టీఆర్ఎస్ ను ఇరుకున పెట్టేలా వ్యవహరిస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది.