జగన్ అష్ట దిగ్బంధం.. బయట పడేనా ?

ప్రస్తుతం అధికార వైసీపీలో నెలకొన్న అసమాననతలు ఆ పార్టీని తీవ్రంగా కలవర పెడుతున్నాయి.ఇటీవల పలువురు ఎమ్మేల్యేలు తిరుగుబాటు గళం వినిపించడం మరోవైపు వివేకా హత్య కేసులో వైసీపీ వైపు మల్లుతుండడం.

 Jagan Ashta Quarantine Will He Come Out ,jagan Ashta Quarantine ,cm Jagan , Ycp-TeluguStop.com

ఇంకోవపు మూడు రాజధానుల అంశం ఒ కొలిక్కి రాకపోవడం.అలా చాలా అంశాలు సి‌ఎం జగన్ కు తీవ్ర తలనొప్పిగా మారాయి.

వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లోనూ క్లీన్ స్వీప్ చేయాలని చూస్తున్న జగన్ కు ప్రస్తుతం చుట్టుముడుతున్న సమస్యలు ఇబ్బందికరంగా మారాయనడంలో ఎలాంటి సందేహం లేదు.ఎప్పుడు లేని విధంగా వైసీపీలో పలువురు ఎమ్మేల్యేలు.

జగన్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Telugu Cm Jagan, Jaganashta, Jagan Sarkar, Kotamreddy, Viveka, Ycpmp-Politics

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏకంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చి వైసీపీకి షాక్ ఇచ్చారు.అంతే కాకుండా వైసీపీని విడేందుకు 45 మంది ఎమ్మేల్యేలు సిద్దంగా ఉన్నారని చెప్పి మరో బాంబ్ పేల్చారు.దీంతో అసలు అధికార పార్టీలో ఏం జరుగుతోందనే చర్చ ఊపందుకుంది.

ఇక మూడు రాజధానుల అంశం కూడా సి‌ఎం జగన్ కు తలనొప్పిగా మారింది.మొదటి నుంచి కూడా మూడు రాజధానులు అమలు చేసి తీరుతామని జగన్ సర్కార్ కాన్ఫిడెంట్ గా ఉన్నప్పటికి.

దీనిపై ఉన్న అడ్డంకులు ఇప్పట్లో తొలిగేలా లేవు.ఎన్నికలకు సమయం తక్కువ ఉంది.

ఒకవేళ చెప్పినట్లుగా మూడు రాజధానులు అమలు కాకపోతే.వైసీపీలో ఎన్నికల నాటికి కాన్ఫిడెన్స్ లోపించే అవకాశం ఉంది.

అది ఎలక్షన్స్ పై ప్రభావం చూపిన ఆశ్చర్యం లేదు.ఇక హామీల విషయంలో కూడా జగన్ సర్కార్ పై వ్యతిరేకత గట్టిగానే ఉంది.

Telugu Cm Jagan, Jaganashta, Jagan Sarkar, Kotamreddy, Viveka, Ycpmp-Politics

సిపిఎస్ రద్దు, సంపూర్ణ మద్యపాన నిషేదం, ప్రత్యేక హోదా వంటి హామీలను జగన్ సర్కార్ పూర్తి పక్కన పెట్టేసినట్లే కనిపిస్తోంది.దాంతో ప్రజల్లో వైసీపీపై నమ్మకం సన్నగిల్లే అవకాశాలు కూడా ఉన్నాయి.ఇక వివేకా హత్య కేసు కూడా జగన్ కు తలనొప్పిగానే మారింది.గత ఎన్నికల ముందు వివేకా హత్యపై ఘాటుగా స్పందించిన జగన్.అధికారం చేపట్టిన తరువాత మాత్రం వివేకా హత్యను అసలు ప్రస్తావనకే తీసుకురాలేదు.ఇంకా ఆసక్తికర అంశం ఏమిటంటే.

హత్య కు సంబంధించిన వారికి ప్రభుత్వం అండగా నిలుస్తోందని.ఏకంగా సీబీఐ యే చెప్పడం గమనార్హం.

దాంతో ఈ కేసును ప్రస్తుతం తెలంగాణ సీబీఐ విచారిస్తోంది.ఇప్పటికే వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి విచారించిన సంగతి కూడా తెలిసిందే.

ఇలా జగన్ను ఆయా అంశాలు, హామీలు, సమస్యలు అన్నీ చుట్టుముట్టాయి.ఇవన్నీ కూడా వచ్చే ఎన్నికల్లో వైసీపీ పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు.

మరి వీటన్నిటి నుంచి వైఎస్ జగన్ ఎలా బయటపడటారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube