తెలుగు సినీ నటి, స్టార్ యాంకర్ సుమ పరిచయం గురించి తెలియని వారెవ్వరు లేరు.తన యాంకరింగ్ తో మంచి గుర్తింపు అందుకుంది సుమ.
బుల్లితెరలో ఎన్నో ఏళ్ళనుండి ఉంటూ స్టార్ యాంకర్ గా నిలిచింది.తన మాటలతో వేదిక మొత్తం సందడి చేస్తుంది.
బుల్లితెర షో లలోనే కాకుండా సినీ అవార్డు, ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లలో కూడా హోస్టింగ్ చేస్తూ బాగా సందడి చేస్తుంది.ఇక గెస్ట్ గా వచ్చిన వాళ్ళను మాత్రం ఓ ఆట ఆడుకుంటుంది సుమ.సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.
ఇటీవలే తన యూట్యూబ్ ఛానల్ ను కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే.
అందులో ఎన్నో రకాల ఎంటర్టైన్మెంట్ లను కూడా అందిస్తుంది.ఇక ఆమె మంచి క్రేజ్ సంపాదించుకున్న షో క్యాష్ అనే చెప్పవచ్చు.
ఇక ఈ షోలో ఎంతో మంది సెలబ్రెటీలను ఆహ్వానించి బాగా సందడి చేస్తుంది.అంతేకాకుండా ఈ షో రేటింగ్ లో బాగా దూసుకుపోతుంది.
నిజానికి సుమ ఇంతవరకు ఎవరిపై కోప్పడలేదు.కానీ తాజాగా బాగా కోపం తెచ్చుకుంది.
ఈటీవీలో ప్రసారమవుతున్న క్యాష్ షో ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదల కాగా అందులో జబర్దస్త్ కమెడియన్స్ పంచ్ ప్రసాద్, నూకరాజు, ఇమాన్యుయేల్, జబర్దస్త్ బాబు లు తమ కుటుంబ సభ్యులతో గెస్టుగా హాజరయ్యారు.ఇక ఇందులో సందడి మాత్రం బాగా ఆకట్టుకుంది.పంచ్ ప్రసాద్ తన పంచ్ లతో బాగా హైలెట్ గా నిలిచారు.ఇక సుమను కూడా ఓ ఆట ఆడుకున్నాడు.అంతేకాకుండా తల్లికే సెటైర్లు వేస్తూ.అవతలి వారి కుటుంబ సభ్యులపై కూడా బాగా పంచులు వేశాడు.
ఇక చివర్లో ప్రసాద్ తన మేనమామ వల్ల ఈ స్టేజ్ కి వచ్చాను అంటూ థాంక్యూ మామయ్య అని అనగా ఒకవేళ ఈయన హెల్ప్ చేయకపోతే ఇంకా గొప్ప పొజిషన్ లో ఉండే వాడినేమో అని పంచ్ వేసాడు.దీంతో అక్కడున్న వాళ్ళంతా తెగ నవ్వుకోగా సుమ కోపంతో తన చేతిలో ఉన్న కార్డు విసిరేసి మరి తెగ నవ్వుకుంది.