రాకింగ్ రాకేష్ హీరోగా మొదటి సినిమా.. కెసిఆర్ పాత్రలో కనిపించబోతున్న కమెడియన్?

బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి జబర్దస్త్ కామెడీ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ కామెడీ షో ద్వారా ఎంతో మంది మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

 Jabardasth Comedian Rocking Rakesh First Movie Titled As Kcr Poster Goes Viral ,-TeluguStop.com

ఒకప్పుడు జబర్దస్త్ ( Jabardasth ) కార్యక్రమంలో కమెడియన్స్ గా పని చేసిన వారందరూ కూడా ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో హీరోలుగాను దర్శకుల గాను కొనసాగుతూ ఉన్నారు.ఈ క్రమంలోనే జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు పొందినటువంటి వారిలో కమెడియన్ రాకింగ్ రాకేష్ ( Rocking Rakesh ).ఒకరు.ఈయన కూడా త్వరలోనే హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే.

Telugu Anannya, Anji, Jabardasth, Kcr, Rakesh, Tollywood-Movie

ఇప్పటికే ఈయనని హీరోగా ప్రకటిస్తూ ఈ సినిమాకు సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు అన్నింటిని కూడా ఎంతో ఘనంగా ప్రారంభించారు.ప్రస్తుతం ఈయన సినిమా షూటింగ్ పనులన్నీ కూడా జరుగుతున్నాయని తెలుస్తుంది.తాజాగా రాకేష్ నటించబోతున్నటువంటి సినిమా గురించి ఒక అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.తాజాగా ఈ సినిమాకి కెసిఆర్ ( K C R )అనే టైటిల్ ని పెట్టారు.

కేసీఆర్ అంటే కేశవ చంద్ర రామావత్ ( kesava Chandra Ramavath ) అని అర్ధం.ఇక ఈ టైటిల్ అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది.

తెలంగాణ సీఎం కేసీఆర్ కట్ అవుట్ ముందు ఒక పిల్లడు నిలుచొని కనిపిస్తున్నాడు.

Telugu Anannya, Anji, Jabardasth, Kcr, Rakesh, Tollywood-Movie

ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి పోస్టర్ కనుక చూస్తుంటే ఈ సినిమా తప్పకుండా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో రాబోతుందని అర్థమవుతుంది.రాకేష్ జబర్దస్త్ కమెడియన్ గా కొనసాగుతూ హీరోగా ఎంట్రీ ఇచ్చినటువంటి సినిమాకి ఏకంగా కేసీఆర్ అంటూ టైటిల్ పెట్టడంతో ఇది కాస్త అందరి దృష్టిని ఆకర్షించింది.సినిమాలో రాకింగ్ రాకేష్, అనన్య( Anannya ) హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

గ్రీన్ టీ ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో విభూది క్రియేషన్స్ పతాకంపై గరుడవేగ మేకింగ్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 గా రాబోతున్న ఈ సినిమాకు అంజి అనే కొత్త డైరెక్టర్ దర్శకత్వం వహిస్తున్నారు మరి జబర్దస్త్ కమెడియన్ గా ఎంతో రాకేష్ హీరోగా ఎలాంటి సక్సెస్ అందుకుంటారో తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube