అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందు బైడెన్‌కు ‘‘సన్’’ స్ట్రోక్ తప్పదా..?

అధ్యక్ష ఎన్నికలకు( US Presidential Elections ) సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో అమెరికాలో రాజకీయాలు వేడెక్కాయి.ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్,( President Joe Biden ) మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌లు 2024 అధ్యక్ష బరిలో నిలిచారు.

 Is Us Presidnet Joe Biden Son Hunter Likely To Face Serious Charges Details, Us-TeluguStop.com

వీరితో పాటు డెమొక్రాటిక్, రిపబ్లికన్ పార్టీలకు చెందిన పలువురు నేతలు కూడా రేసులో నిలిచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.ఇక అధ్యక్షుడు జో బైడెన్ విషయానికి వస్తే.

ఇప్పుడిప్పుడే ఆయన పాలనపై పట్టుబిగిస్తున్నారు.ఆర్ధిక మాంద్యం, నిరుద్యోగం, బ్యాంకుల దివాళా , ద్రవ్యోల్బణం వంటి అంశాలు బైడెన్‌కు నిద్ర లేకుండా చేస్తున్నాయి.

ఇటీవల అమెరికా రుణ పరిమితి అంశం ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేసింది.అయితే బైడెన్ తన మంత్రాంగంతో రిపబ్లికన్‌లను దారికి తెచ్చుకుని కాంగ్రెస్‌లో రుణ పరిమితి పెంపుకు అడ్డంకులను క్లియర్ చేసుకున్నారు

Telugu Hunter Biden, Internal, Presidnetjoe, Presidential, William Barr-Telugu N

అయితే రానున్న కాలంలో కుమారుడు హంటర్( Hunter Biden ) కారణంగా జో బైడెన్ ఇబ్బందులు ఎదుర్కోనే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ విచారణ కారణంగా హంటర్ బైడెన్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కోనే అవకాశం వుందని మాజీ యూఎస్ అటార్నీ జనరల్ విలియం బార్ అన్నారు.ప్రధానంగా పన్ను చెల్లింపునకు సంబంధించి అభియోగాలు, తుపాకీని కొనుగోలు చేసేటప్పుడు తప్పుడు ప్రకటనలు వంటి ఆరోపణలను హంటర్ ఎదుర్కొంటున్నారు.

హంటర్‌పై పన్ను కేసు క్లిష్టంగా వుందని.ఇంటర్నల్ రెవెన్యూ సర్వీసెస్ (ఐఆర్ఎస్)తో కలిసి పనిచేయాల్సిన అవసరం వున్నందున విచారణకు ఎక్కువ సమయం పట్టే అవకాశాలు వున్నాయని బార్ అభిప్రాయపడ్డారు.

Telugu Hunter Biden, Internal, Presidnetjoe, Presidential, William Barr-Telugu N

దీనితో పాటు విదేశీ వ్యాపార వ్యవహారాలపైనా రిపబ్లికన్‌ల నుంచి చట్టపరమైన పరిశీలనను ఎదుర్కొంటున్నారు హంటర్ బైడెన్. ఆయనకు చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ (సీసీపీ)తో సంబంధాలు వున్న విదేశీ కంపెనీలతో వ్యాపార లావాదేవీలు వున్నాయని జీవోపీ చట్టసభ సభ్యులు ఆరోపిస్తున్నారు.మరోవైపు.హంటర్‌ను ప్రాసిక్యూట్ చేయడానికి ఫెడరల్ ఏజెంట్ల వద్ద తగినన్ని సాక్ష్యాలు వున్నాయని గతేడాది పలు నివేదికలు స్పష్టం చేశాయి.అయితే మధ్యంతర ఎన్నికల తర్వాత అభియోగాలు నమోదవుతాయని భావించారు.కానీ న్యాయశాఖ ఇప్పటి వరకు అలాంటి ఛార్జీలను ప్రకటించలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube