ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది యంగ్ హీరోల్లో సిద్దు జొన్నల గడ్డ( Siddu jonnalagadda ) ఒకడు…ప్రస్తుతం ఆయన డిజే టిల్లు సినిమా కి సీక్వెల్ చేస్తున్నాడు… డీజే టిల్లు సినిమా సూపర్ హిట్ అవ్వడం తో ఈ సినిమాకి సీక్వెల్ గా వచ్చే ఈ సినిమా మీద కూడా జనాలలో మంచి అంచనాలు ఉన్నాయి.అందుకే ఈ సినిమా యూనిట్ కూడా చాలా వరకు ఈ సినిమా సక్సెస్ మీద విపరీతమైన నమ్మకం తో ఉంది అందుకే సిద్దు ఇంకా వేరే ప్రాజెక్ట్ లు కూడా ఏమి ఒప్పుకోకుండా ప్రస్తుతం ఇదే ప్రాజెక్ట్ మీద ఉంటున్నాడు…
ఇక ఈ సినిమా సక్సెస్ అయితే సిద్దు ఇంకా మంచి హీరో గా మారడమే కాకుండా ఇండస్ట్రీ లో తన మార్కెట్ కూడా భారీ గా పెరుగుతుంది…సిద్దు ఇంతకుముందు చేసిన సినిమాలు వేరు ఇప్పుడు చేస్తున్న సినిమాలు వేరు డీజే టిల్లు తో కంప్లీట్ గా ఆయన యాక్టింగ్ స్కిల్స్ కానీ, ఆటిట్యూడ్ గానీ మార్చుకొని కొత్త బాడీ లాంగ్వేజ్ తో సినిమాలు చేస్తున్నాడు…
ఇక డీజే టిల్లు సీక్వెల్( Tillu Square ) సినిమా స్టోరీ విషయానికి వస్తె మొదటి పార్ట్ కి దీనికి అసలు సంబందం లేకుండా ఇది ఒక ఫ్రెష్ స్టోరీ గా వస్తున్నట్టు గా తెలుస్తుంది…ఈ సినిమాలో హీరోయిన్( Anupama Parameswaran ) కి ఒక ప్రాబ్లమ్ రావడం తో హీరో ఆ ప్రాబ్లం ని ఎలా సాల్వ్ చేశాడు అనేది కథ గా తెరకెక్కిస్తున్నారట…మొదట తీసిన డీజే టిల్లు కంటే కూడా ఈ స్టోరీ లో ట్విస్టులతో ప్రేక్షకులని షాక్ కి గురి చేస్తుంది అంటూ ఈ సినిమా టీమ్ ఇప్పటికీ ఈ సినిమా గురించి చెబుతూ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచుతున్నారు…