ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్( BRS party ) లో గ్రూపు రాజకీయాలు పెరిగిపోతున్నాయి.రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల ఎంపిక పైన బీఆర్ఎస్ అధిష్టానం దృష్టి సారించడంతో , ఆశావాహులు పెద్ద ఎత్తున అగ్ర నేతల దృష్టిలో పడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అయితే ఎక్కువ స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇస్తామని కేసీఆర్ ( CM kcr )ప్రకటించడంతో, కొన్ని కొన్ని నియోజకవర్గాల్లోని నాయకుల మధ్య గ్రూపు రాజకీయాలు పెరిగిపోతున్నాయి.
ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు కేటాయిస్తే, మా తడాఖా చూపిస్తామంటూ కొంతమంది నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తూ మరింత కాక రేపుతున్నారు.దీంతో ఎన్నికల సమయంలో నియోజకవర్గాల్లో ఈ తరహా గ్రూపు రాజకీయాలు పెరిగిపోవడం, బిఆర్ఎస్ అధిష్టానానికి తలనొప్పిగా మారింది.
తమ అభిస్టానికి వ్యతిరేకంగా సెట్టింగ్ ఎమ్మెల్యేలకి టికెట్ ఇస్తే తమ సత్తా ఏంటో చూపిస్తామని సవాళ్లు అధిష్టానానికి విసురుతున్నారు.ఈ తరహా పరిస్థితులు చాలా నియోజకవర్గాల్లో నెలకొనడంతో, ఈ విషయంలో ఏం చేయాలనే ఆందోళన బీఆర్ఎస్ అధిష్టానం లో కలుగుతోంది.
ఇక చొప్పదండి నియోజకవర్గంలో ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కు వ్యతిరేకంగా కొంతమంది నాయకులు వాయిస్ వినిపిస్తున్నారు.ఈ రిజర్వడ్ స్థానంలోని మూడు మండలాల్లో వెలమ, రెడ్లకు, ఒక మండలంలో బీసీ సామాజిక వర్గానికి గట్టుపట్టు ఉంది.అభ్యర్థి ఎంపిక దగ్గర నుంచి గెలుపు వరకు ఈ మూడు ప్రధాన సామాజిక వర్గాలే కీలకం.వచ్చే ఎన్నికల్లో బండపల్లి యాదగిరి కి చొప్పదండి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించుకునే ఆలోచనలో ఉన్నారు.
ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సుంకే రవిశంకర్ తమ మధ్య వివాదాలు పెట్టే ప్రయత్నం చేశారని, ఈ మూడు ప్రధాన సామాజిక వర్గాలకు చెందిన వారు ఆరోపిస్తున్నారు.
ఇక రామగుండం విషయానికి వస్తే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కోరుకొని చందర్ కు మళ్ళీ టికెట్ ఇవ్వొద్దని అసమ్మతి నాయకులు బీఆర్ఎస్ అధిష్టానం పై ఒత్తిడి చేస్తున్నారు.ఇక్కడ కందుల సంధ్యారాణి, మాజీ మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ, కార్మిక నాయకుడు రాజిరెడ్డి ,కార్పొరేటర్ దంపతులు టికెట్ ప్రయత్నాల్లో ఉన్నారు.ఈ ఐదుగురు కలిసి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పాదయాత్రను సైతం నిర్వహించి కలకలం సృష్టించారు.
తాజాగా మరో ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు.తమలో ఎవరికి టిక్కెట్ ఇచ్చినా పర్వాలేదని, పార్టీ విజయం కోసం తామంతా కలిసి పని చేస్తామని సిట్టింగ్ ఎమ్మెల్యేకు మాత్రం టికెట్ ఇవ్వవద్దని అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నారుఇదేవిధంగా కల్వకుర్తిలో జైపాల్ యాదవ్( Jaipal yadav ) మళ్లీ అవకాశం ఇవ్వవద్దని అక్కడ అసమ్మతినేతలంతా ఏకమయ్యారు.
ఆయనకు టికెట్ ఇస్తే స్వతంత్ర అభ్యర్థిని నిలబెట్టి గెలిపించుకుంటామని అసమ్మతి వర్గం హెచ్చరిస్తోంది.ఇదేవిధంగా ఎక్కడికక్కడ ఈ తరహా గ్రూపు రాజకీయాలు పెరిగిపోవడం, టికెట్ కేటాయింపు విషయంలో కొత్త తలనొప్పులు తెరపైకి వస్తుండడం తో బీఆర్ఎస్ అధిష్టానానికి ఆందోళన కలిగిస్తోంది.
.