టీఆర్ఎస్ లో జంపింగ్ నేతల లిస్ట్ పెరుగుతోందా ?

తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ కు తిరిగే లేదు అన్నట్లుగా పరిస్థితి ఉండేది .అయితే తెలంగాణలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యం లో బిజెపి అనూహ్యంగా బలం పెంచుకుంది.

 Is The List Of Jumping Leaders Increasing In Trs ,trs, Telangana, Kcr, Bjp, Cong-TeluguStop.com

కాంగ్రెస్ లోని కొమ్ములాటలు షర మామూలు అవడం,  ఆ పార్టీ బలహీనం కావడంతో,  బిజెపి ఆ అవకాశాన్ని అందుకొచ్చుకుని తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.ఇది ఇలా ఉంటే అధికార పార్టీగా ఉన్న టిఆర్ఎస్ లో మాత్రం ఇప్పుడిప్పుడే నాయకులు మధ్య అంతర్గత విభేదాలు తెరపైకి వస్తున్నాయి .

ముఖ్యంగా ఇతర పార్టీల నుంచి టిఆర్ఎస్ లో చేరిన నాయకుల్లో తమకు సరైన ప్రాధాన్యం దక్కలేదన్న అసంతృప్తి పెరిగిపోతుంది.ఈ క్రమంలోనే వారు పార్టీ మారేందుకు కూడా సిద్ధమవుతుండడం, ఎన్నికల సమయంలో ఈ తతంగం చోటు చేసుకుంటుండడంతో,  టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ లో టెన్షన్ రోజురోజుకు పెరిగిపోతుంది.

మునుగోడు ఉప ఎన్నికల తో పాటు సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న సమయంలో పార్టీ కీలక నాయకులు మధ్య అంతర్గత కుమ్ములాటలు చోటు చేసుకోవడం,  అసమ్మతి బహిరంగంగా వినిపిస్తూ ఉండడం,  పార్టీ మారేందుకు ఏర్పాట్లు చేసుకోవడం ఇవన్నీ ఇబ్బందికరంగా మారాయి.ముఖ్యంగా ఖమ్మం టిఆర్ఎస్ లో కీలక నేతగా వ్యవహరిస్తూ వచ్చిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ మారుతారని ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది.
 

Telugu Congress, Telangana-Politics

అయితే ఈ వ్యాఖ్యలను ఎప్పటికప్పుడు ఆయన ఖండిస్తూ వస్తున్న, ఆయన పార్టీ మారుతారని ప్రచారం మాత్రం తీవ్రంగా జరుగుతోంది.ఆదివారం జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు టిఆర్ఎస్ లో చర్చనీయాంశంగా మారాయి.ఇంకేంటి శీనన్న అనే ఉత్కంఠ ఎవరికి వద్దని , అలాగే మీ వెంట నడిచే వారిలోనూ ఇలాంటి ఉత్కంఠలే తీసుకురావద్దని,  కాలం సందర్భం అన్ని భగవంతుడే నిర్ణయిస్తాడని,  మనం ఊరికే బోర్ల పడాల్సిన పనిలేదన్నారు.మీ గుండెల్లో మంచి స్థానం ఇచ్చిన ఆ భగవంతుడే మనందరికీ మంచి మార్గం చూపిస్తాడని,  త్వరలోనే మంచి ఫలితం రానుందని ఇందులో తనను నమ్ముకున్న వారందరికీ వాటా ఉంటుందని పొంగులేటి మాట్లాడడంతో,  ఆయన పార్టీ మారుతారని ప్రచారానికి మరింత బలం చేకూరింది.

మరో మాజీ ఎంపీ బూరా నరసయ్య గౌడ్ ఇదే విధంగా సంచల వ్యాఖ్యలు చేశారు.తనకు పార్టీ కార్యక్రమాలపై సరైన సమాచారం ఇవ్వడం లేదని,  ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే కర్నే ప్రభాకర్ తనను కలుపుకు వెళ్లడం లేదని,  బహిరంగంగానే తన అసంతృప్తిని వెల్లగాక్కుతున్నారు.

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం కు ఇంచార్జీగా వ్యవహరిస్తున్న మంత్రి జగదీశ్ రెడ్డి సమాధానం చెప్పాలని నరసయ్య గౌడ్ డిమాండ్ చేస్తున్నారు.ఇక ఆయన కూడా అసంతృప్తి బహిరంగంగా వ్యక్తం చేస్తున్న నేపథ్యం పార్టీ మారుతారని ప్రచారం జరుగుతుంది.

వీరే కాకుండా ప్రతి నియోజకవర్గంలోనూ అసంతృప్తి నేతలు ఇప్పుడిప్పుడే గొంతు పెంచుతూ ఉండడం తో ఎప్పుడు ఎవరు పార్టీకి గుడ్ బాయ్ చెప్తారో అనే టెన్షన్ టీఆర్ఎస్ నేతల్లో మొదలయ్యింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube