దక్షిణాది రాష్ట్రాల్లో బలపడాలనే కోరికను వీలైనంత తొందరగా తీర్చుకోవాలనే ఆలోచనలో బీజేపీ ఉంది.అందుకో ఒక్కో రాష్ట్రంలో తమ హవా చాటుకునేందుకు ఉత్సాహం చూపిస్తోంది.
దానిలో భాగంగానే ప్రాంతీయ పార్టీలను దెబ్బ కొట్టేలా తమకున్న అధికారాన్ని ఇందుకోసం ఉపయోగించాలని చూస్తోంది.ఇప్పుడు బీజేపీ ద్రుష్టి మొత్తం తెలుగురాష్ట్రాల మీదే పెట్టింది.
ఎన్నికల ముందుకు వరకు ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి అన్నివిధాలా సహాయ సహకారాలు అందించిన బీజేపీ పెద్దలు ఆ తరువాత తరువాత తమ వైకిరిలో మార్పు చూపిస్తూ వస్తున్నారు.అయినా ఏపీ సీఎం జగన్ మాత్రం కేంద్ర పెద్దలతో సఖ్యత చూపించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు.
అదే సమయంలో ఏపీ బీజేపీ నేతలు జగన్ ను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తూ రాజకీయంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారు.ఇక కేసీఆర్ విషయంలో అయితే కేంద్రం నుంచి కూడా ఆయనను ఇబ్బందిపెట్టే చర్యలు తీసుకుంటున్నారు.
ఇక ఇప్పుడు తెలుగు రాష్ట్రాల సీఎం లు ఇద్దరూ తమకు రాజకీయ శత్రువులు కావడంతో వారిని రాజకీయంగా దెబ్బకొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది.అందులో భాగంగా తెలంగాణ కు ఆర్థిక వనరుగా ఉన్నహైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలన్నది బీజేపీ ఆలోచనగా ఉన్నట్టు తెలుస్తోంది.
తెలంగాణ లోని 35 శాతం హైదరాబాద్ తో చేర్చి యు.టి చేస్తే టీఆర్ఎస్, వైసిపి, మజ్లిస్, టిడిపి ల మనుగడ ప్రశ్నర్ధకం అవుతుందని బీజేపీ ప్లాన్ చేస్తోంది.ఇప్పటికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్, బిజెపి పార్టీలు తమకు రాజకీయంగా తీరని అన్యాయం చేసిందని, విభజన తరువాత బలంగా నమ్ముతున్నారు.రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి అభివృద్ధి చేసుకున్న హైదరాబాద్ తెలంగాణ కు వెళ్లడం తో విద్యా, ఉద్యోగ అవకాశాల్లో ఏపీకి అన్యాయం జరిగిందని, బలమైన ఆర్ధిక వనరుగా ఉన్న హైదరాబాద్ తెలంగాణకు దక్కడం వల్ల ఈ రెండు జాతీయ పార్టీల మీద ఏపీ ప్రజల్లో ఆగ్రహం ఉంది.
నేపథ్యంలో హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తే అటు టీఆర్ఎస్ పార్టీకి ఇటు వైసీపీ హవాకు గండి కొట్టవచ్చని బీజేపీ ప్లాన్ చేస్తోంది.
అదే జరిగితే హైదరాబాద్ లేని మిగిలిన ప్రాంతం ఆంధ్రా తో ఆర్ధికంగా సమానం అవుతుందని విద్యా ఉద్యోగ అవకాశాలు అందరికి ఒకేలా ఉంటాయి కనుక ఏపీ ప్రజలు తమ పార్టీ పై సానుకూల దృక్పధాన్ని అవలంబిస్తారని బీజేపీ నమ్ముతోంది.అలాగే బలమైన ఆర్ధిక సంపన్నులు కేంద్రం అదుపులో ఉంటారని బీజేపీ నమ్ముతోంది.అయితే ఇదంతా అనుకున్నంత ఈజీ అయితే కాదు.
ఎందుకంటే గతంలో హైదరాబాద్ లేని రాష్ట్రం మాకోద్దంటూ కేసీఆర్ కాంగ్రెస్ పెద్దల ముందు పంచాయితీ పెట్టిన సంగతి తెలిసిందే.ఇప్పుడు బీజేపీ కనుక కేంద్రపాలిత ప్రాంతంగా హైదరాబాద్ ను మార్చే ఉద్దేశం లో ఉంటే మరో ఉద్యమం తప్పదనే సంకేతాలు వినిపిస్తున్నాయి.