iPhone 14లో అదిరిపోయే ఫీచర్.. ఇక నెట్ వర్క్‌తో పనేలేదు

టెక్నాలజీ చాలా మారుతోంది.రోజు రోజుకు నూతన ఆవిష్కరణలతో ముందడుగు వేస్తుంది.ఇక ఇప్పటికే ఇంటర్నెట్‌తో ప్రపంచాన్నే చుట్టేస్తున్న విషయం తెలిసిందే.4జీ, 5జీ సేవలతో దూసుకెళ్తోంది.అయితే అడవి ప్రాంతాలు, లేదా సీటీ ఔట్ కట్స్ లాంటి ప్రదేశాలకు వెళ్లినప్పడు కొంత వరకు నెట్ పని చేయదు.దీంతో ఏదైనా ముఖ్యమైన సమాచారం చేరవేయాలంటే కష్టం అవుతుంది.

 Iphone 14 Model Coming With Earth Orbit Satellite Connectivity Feature-TeluguStop.com

ఇక ఆ కష్టం తీరిపోయినట్లే, నెవర్క్ లేని ప్రదేశాల్లో కూడా పనిచేసే ఫోన్ సెప్టెంబర్ 7న వినియోగ దారుల ముందుకు రానుంది.అది ఏ ఫొన్ అని అనుకుంటున్నారా.

ఐఫోన్ 14 సీరిస్.ఇప్పటికే చాలా మంది ఈ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నారు.

చాలా రోజుల నుంచి మార్కెట్లోకి వస్తది అనుకున్న వినియోగదారులకు ఎదురుచూపులు తప్పలేదు.కానీ ఎట్టకేలకు వారికి గుడ్ న్యూస్ చెప్తూ.సెప్టెంబర్ 7న మార్కెట్‌లోకి రానుంది.ఫార్ ఔట్ ట్యాగ్ లైన్‌తో నిర్వహించనున్న ఈ లాంచ్ ఈవెంట్‌లో ఐఫోన్ 14 అందరినీ ఆకట్టుకోవడానికి రెడీ అవుతుంది.

ఇక ఇప్పటికే ఇందులో చాలా ఫీచర్స్ ఉండగా.మరో కొత్త ఫీచర్ వచ్చింది.

ఐఫోన్ 14 మోడల్స్‌ సెల్లులార్ సిగ్నల్ లేని ప్రాంతాల్లో లో ఎర్త్ ఆర్బిట్ (LEO) శాటిలైట్ కనెక్టివిటీ సాయంతో పనిచేస్తాయి.మొబైల్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్‌ను ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్ ద్వారా ఇప్పటికే పరిచయం చేసిన విషయం తెలిసిందే.

Telugu Cellularsignal, Earthorbit, Elon Musk, Iphone, Latest, Launch, Spacex, Up

అసలు నెవర్క్ లేకుండా శాటిలైట్ ద్వారా ఎలా పనిచేస్తుందని చాలా మందకి సందేహాలు ఉంటాయి.అయితే శాటిలైట్ కనెక్టివిటీకి సపోర్ట్ చేసేలా ఐఫోన్ హార్డ్‌వేర్‌ను యాపిల్ రూపొందించినట్లు తెలుస్తోంది.దీనివల్ల, సెల్యులార్ కవరేజీ లేని ప్రదేశాల్లో కూడా యూజర్లు కాల్స్, మెసేజ్‌లు పంపుకోవడం సులభం అవుతుందంట.అత్యవసర కమ్యూనికేషన్ల కోసం శాటిలైట్ ఆధారిత నెట్‌వర్క్‌లకు iPhone 14ని సక్సెస్‌ఫుల్‌గా కనెక్ట్ చేయడంలో హార్డ్‌వేర్ పరీక్షలు సైతం పూర్తైనట్లు సమాచారం.

ఇక ఇప్పటికే ఈ ఫొన్‌కు మార్కెట్‌లో చాలా డిమాండ్ ఉంది.ఎంతో మంది ఇది ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube