స్టార్ హీరో నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో ది ఘోస్ట్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.హై వోల్టేజ్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీస్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.
గరుడవేగ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న ప్రవీణ్ సత్తారు ది ఘోస్ట్ మూవీతో ఆ సినిమాను మించిన సక్సెస్ ను ఖాతాలో వేసుకోవాలని భావిస్తున్నారు.ఇప్పటికే రిలీజైన ది ఘోస్ట్ టైటిల్, ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.
ఈ సినిమాలో మొదట హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ఎంపికయ్యారు.కాజల్ కొన్నిరోజుల పాటు ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనగా కొన్ని కారణాల వల్ల ఈ సినిమా నుంచి ఆమె తప్పుకున్నారు.
కాజల్ స్థానాన్ని భర్తీ చేయడానికి చాలామంది పేర్లను పరిశీలించి చివరకు ఆమెకు బదులుగా అమలాపాల్ ను ఎంపిక చేశారని సమాచారం.ఈ సినిమాలో రొమాంటిక్ సీన్లు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.

అందమైన హిల్ స్టేషన్ లో ప్రవీణ్ సత్తారు ఈ సినిమాకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించనున్నారని తెలుస్తోంది.ఈ సీన్లలో లిప్ లాక్ సీన్ కూడా ఉంటుందని సమాచారం.అయితే కొన్ని షరతులతో లిప్ లాక్ సీన్ చేయడానికి అమలాపాల్ అంగీకరించారని సమాచారం.లిప్ లాక్ సీన్స్ లో నటించాలంటే మరింత ఎక్కువ రెమ్యునరేషన్ కావాలని అమలా పాల్ కోరినట్టు తెలుస్తోంది.