సరిగ్గా నాలుగురోజుల క్రితం మాకు గ్రీన్‌కార్డు లు విడుదల చేయండి అంటూ భారత ఎన్నారైలు శ్వేతసౌధం ముందు నిరసన తెలిపిన విషయం అందరికీ విదితమే అయితే ఈ విషయంలో భారతీయుల గ్రీన్ కార్డ్ ఆశలపై ఒక్కసారిగా నీళ్ళు చల్లింది వాషింగ్టన్‌కు చెందిన కాటో ఇనిస్టిట్యూట్.తమ అంచనా ప్రకారం భారతీయులకి గ్రీన్ కార్డ్ కోరిక తీరాలి అంటే తప్పకుండా “150 ఏళ్ళు” నిరీక్షించాలి అని ఒక అంచనా వేస్తూ నివేదిక బహిర్గతం చేసింది దాంతో ఒక్కసారిగా భారతీయుల గ్రీన్ కార్డ్ ఆశలపై నీళ్ళు చల్లింది.
వివరాలలోకి వెళ్తే.
అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ యుఎస్ గ్రీన్‌కార్డుకోసం పెండింగ్‌లోవున్న భారతీయుల దరఖాస్తుల వివరాలు విడుదల చేసింది…ఈ జాబితాలో దాదాపు 632,219 మంది భారతీయ ఇమ్మిగ్రెంట్స్ గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు.ఇందులో భార్యా, భర్తలు, వారి పిల్లలు కూడా ఉన్నారు…అయితే ఎంతో ప్రతిభాపాటవాలు ఉన్న వారు మాత్రం గ్రీన్ కార్డ్ కావాలంటే మాత్రం కనీసం ఆరేళ్లు ఆగాల్సిందే.వీరిని ఈబి-1 ఇమ్మిగ్రెంట్స్ కేటగిరీలో చేర్చారు.34,824…మంది భారతీయులు.ఈబి-1 కేటగిరీలో ఉన్నారు…అయితే వీరిని కలుపుకుంటూ పోతే వీరిని కలుపుకుంటే ఇబి-1 కేటగిరీ కింద 83,578 మంది భారతీయులు వస్తారు.
అయితే ఈబి-3 కేటగిరీలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉన్నవారు 17 ఏళ్లపాటు గ్రీన్ కార్డు కోసం వేచిచూడాలి.వీరి సంఖ్య ఈ ఏడాది ఏప్రిల్ 20నాటికి దాదాపు 54,892 ఉంది.వీరి భార్య, పిల్లలు 60,381 మందిని కలిపి చూస్తె ఈ క్యాటగిరీలో మొత్తం 1,15,273 మంది ఉన్నారు.ఈబి-2 కేటగిరీ కింద అడ్వాన్స్ డిగ్రీ అర్హత ఉన్నవారు 151 ఏళ్లపాటు గ్రీన్ కార్డు కోసం వేచిచూడాలి.చట్టాలు, నిబంధలు మారిస్తే తప్ప వీరికి గ్రీన్‌కార్డు త్వరగా వచ్చే అవకాశం లేనేలేదు.చట్టాలు మారని పక్షంలో వీరు అమెరికా వదలి వెళ్లక తప్పదని అంటున్నారు…మరి ఈ సంస్థ ఇచ్చిన రిపోర్ట్ లతో భారత ఎన్నారైలకి గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి.10 దేళ్ళు ఆగడానికి కూడా మీకు ఎన్నో అభ్యంతరాలు ఉన్నాయి అలాంటిది 150 ఏళ్ళు ఆగాలంటే ఎలా అంటూ తీవ్రంగా మధన పడుతున్నారు.