తీరు మార్చుకొని బాబు...పదే పదే అదే తప్పు

బీజేపీ రాష్ట్రానికి అన్యాయం చేసిందని ఒకే అజెండాతో చెప్పిందే చెప్పి విసుగుపుట్టిస్తున్నాడు తప్ప కొత్త విషయాలు ఏమీ చెప్పడంలేదు.బీజేపీని ఏపీకి అన్యాయమే చేసి ఉండవచ్చు.

 Chandrababu Commentson Bjp-TeluguStop.com

కానీ పదేపదే ఆ పార్టీ ని తిట్టడం వాళ్ళ ఏపీలో టీడీపీకి పెద్దగా కలిసొచ్చే అంశం ఏమీ లేదు.ఎందుకంటే.

బీజేపీ ఇక్కడ ఒక్క సీటు కూడా గెలుచుకునే పరిస్థితి ఎలాగూ లేదు .పడే పడే బీజేపీని విమర్శించడం వల్ల తన అసమర్ధతను చంద్రబాబు కప్పిపుచ్చుకోవడానికే ఇలా చేస్తున్నాడని సామాన్య జనంలో అనుమానం మాత్రం రేకెత్తుతోంది.

అసలు ఏపీలో అభివృద్ధి విషయానికి వస్తే… టీడీపీ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి… ఇప్పటివరకు ఏమి సాధించారో గట్టిగా చెప్పలేకపోతోంది.ఆ పార్టీ అసలు ఏమి చేసింది?.నామమాత్రపు పనులుచేయడం, పదుల సంఖ్యలో విదేశ ప్రయాణాలు మందీ మార్బలం వెంటేసుకొని, ఒకే నిర్మాణానికి పదిసార్లు ప్రారంభోత్సవాలు, ప్రజలకు పలుమార్లు అంకితం చేయడం, తాను నిప్పు అని చెపుతూ వారు విపక్షం నేరగాళ్ళని చెపుతూ బురద జల్లడం ఇదే పనిగా పెట్టుకుంది.

తెలుగుదేశం పార్టీ అజెండా ఒక్కటే అదే భారతీయ జనతాపార్టీపై వీలైనంత వ్యతిరేకతను ప్రజల్లో పెంపొదించడం.

బీజేపీపై ఎంత వ్యతిరేకత పెంచినా తెలుగుదేశం పార్టీకి ఇసుమంతైనా లాభం లేదు.కారణం బీజేపీకి ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి స్థానం లేదు.అయినా తాను రాష్ట్రానికి ఏ న్యాయం చేయకుండా పూర్తిగా వృధా చేసిన నాలుగేళ్ళ కాలానికి చంద్రబాబు నాయుడు ప్రజలకు లెక్కజెప్పాలి అదీ 2019 ఎన్నికలకు ముందే.

వైసీపీ , జనసేన , బీజేపీ కలిసిపోయారని పదే పదే చెప్తూ.

టీడీపీ ఆందోళన చెందుతోంది.వైసీపీ నేతలు బీజేపీ నేతలతో సమావేశం అయ్యారని అంటూ ప్రచారం చేస్తున్నారు.

ఎన్నికల వరకూ ఇలాగే వ్యవహరించాలనేది చంద్రబాబు అభిమతం.ఇదే నినాదంతో… 2019 ఎన్నికల్లో గెలిచి బయటపడాలనేది తెలుగుదేశం పార్టీ భావన.

ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ అన్యాయం చేసిందని మొన్నటి వరకూ ప్రచారం చేశారు.అయితే ప్రత్యేక హోదా వద్దన్నది తామే నని తెలుగు దేశం నేతలు దాచేస్తూ వచ్చారు.

ప్రత్యేక హోదా అంటే జైలుకే అని చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించడాన్ని ప్రజలంతా మరిచిపోయారనేది తెలుగుదేశం పార్టీ ఫీలింగ్.కాని ప్రజల్లో ఇప్పుడు చంద్రబాబు ప్రత్యేక హోదా సంజీవని కాదు – ప్రత్యేక ప్యాకేజి మనకు కావాలి అంటూ బాబు చెప్పడం ప్రజలు ఎవరూ మర్చిపోలేదు.

ఇక ఇప్పుడు కడపలో ఉక్కుపరిశ్రమ స్థాపన వ్యవహారం కూడా ఇలానే ఉంది.ఉక్కు పరిశ్రమ ఏర్పరచటానికి సాధ్యపడే అవకాశాలు లేవని ఫీజబిలిటీ కూడా లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించి మూడున్నరేళ్ళు అయిపోయింది ఇప్పుడు తేరుకున్న బాబు కుయ్యో మొర్రో అంటున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube