భారతీయులు అమెరికా( America ) ఆశలు ఈనాటివి కాదు.దశాబ్దాలుగా అమెరికా కలలు భారతీయుల( Indians ) జీవన విధానంలో ఒక భాగంగా ఉంటూ వచ్చాయి.
తెలుగు రాష్ట్రాలలో కూడా ఎగువ మధ్యతరగతి కుటుంబాలలో ప్రతి నాలుగు కుటుంబాలలో ఒకరు అమెరికాలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు.రూపాయితో పోలిస్తే డాలర్ విలువ చాలా ఎక్కువగా కావటం తొందరగా ధనవంతులు కావడానికి అవకాశం ఉండట.
ఫ్రీ లైఫ్ స్టైల్ ఉండటం అమెరికా ఎన్ఆర్ఏలకు భారతీయ సమాజంలో గౌరవ మర్యాదలతో పాటు అధిక కట్నం కూడా లభించే అవకాశం ఉండడంతో భారతీయ యువత అమెరికాకు జై కొడుతున్నారు .
అయితే గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఈ పరిస్థితుల్లో మార్పులు వస్తున్నట్లుగా తెలుస్తుంది అమెరికాలో గనకల్చర్ విపరీతంగా పెరగటం మాదకద్రవ్యాల సేవనానికి అక్కడ అనుమతి ఉండడం తో కాల్పుల ఘటనలు అక్కడ నిత్యకృత్యం గా మారిపోయాయి అయితే ఇటీవల అలాంటి కాల్పులకు భారతీయులు ఎక్కువగా బలైపోవడం ప్రవాస భారతీయులను ఎక్కువ ఆందోళన గురిచేస్తుంది.మానసిక సమస్యలు( Psychological problems ) ఎక్కువ ఉన్న జనాభా అధికంగా ఉన్న అమెరికాలో విచ్చలవిడిగా గన్నులు దొరకడంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్న ఆందోళన పెరిగిపోతుంది ముఖ్యంగా భారతీయులను టార్గెట్గా చేసుకొని కూడా కాల్పులు జరుగుతున్న ఘటనలు ఈ మధ్యకాలంలో పెరిగాయి ….అమెరికన్ యూనివర్సిటీలో( American University ) చదువుతున్న భారతీయ విద్యార్థులు అనేక రకాల నైపుణ్యాలను పెంచుకునే స్కిల్ జాబ్స్ లో అమెరికన్ విద్యార్థులతో పోటీపడుతున్నారు.
లక్షల రూపాయలు నెలసరి జీతాలుగా పొందుతున్నారు, తమ అవకాశాలను లాగేసుకొని లగ్జరీగా బతుకుతున్న భారతీయ విద్యార్థులు, ఉద్యోగులు పట్ల పట్ల అక్కడ మిక్సికన్ల లోను సగటు అమెరికన్లలోనూ పెరుగుతున్న అసంతృప్తి ఈ కాల్పులకు కారణం అన్న వాదనలు ఉన్నాయి .సాధారణ జీవనం గడుపుతున్న వీరిలో భారతీయులను లగ్జరీ లైఫ్ స్టైల్ పట్ల అసూయ పేరుకు పోతుందని దాని మూలంగానే ఇలా దాడులు జరుగుతున్నాయి అని వార్తలు వస్తున్నాయి.ఏది ఏమైనప్పటికీ అమెరికా ఆశలతో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరగడంతో ఇకనైనా అమెరికా కోరికలు తగ్గించుకోవాలని ఉన్న దేశం లోనే మంచి అవకాశాలను వెతుకోవడం మంచిదని కొంత మంది అబిప్రాయ పడుతున్నారు.