ప్రకృతి విపత్తుల కంటే కృత్రిమ మేధస్సు ప్రమాదకరమా ?

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్( Artificial Inteligence ) ఇప్పుడు ప్రపంచ మానవాళికి పెను సమస్యగా మారుతుంది అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్న వారి లిస్టు రోజుకి పెరుగుతుంది.కృత్రిమ మేధస్సు వల్ల ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువ ఉన్నాయని దీనిని మరింత అభివృద్ధి చేయడం అంటే తాము కూర్చున్న కొమ్మను తామే నరుక్కునే మూర్ఖత్వం మనిషితో సమానమని దిగ్గజాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .

 Artificial Inteligence Will Going To Be Big Threat For Human Evalution Details,-TeluguStop.com

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో నడిచే చాట్ జిపిటి( ChatGPT ) వంటి వాటి వల్ల వల్ల ఇప్పటికే చాలా రంగాలలో ఉద్యోగాలు కోతకు గురయ్యాయని వార్తలు వస్తుండగా దీనిని మరింత అభివృద్ధి చేయడం ద్వారా మానవ మనగడే ప్రమాదంలోకి పడుతుందంటూ హెచ్చరిస్తున్న వారు పెరుగుతున్నారు .ఇప్పుడు తాజాగా ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ సృష్టికర్తల్లో ఒకరుగా పేరుగాంచిన హంటర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు .

Telugu Ai Threat, Big Threat, Chatgpt, Elon Musk, Hunter, Joe Biden, Warren Buff

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల వచ్చే ప్రమాదాలతో పోలిస్తే ప్రకృతి విపత్తుల వల్ల వచ్చే ప్రమాదాలు చాలా చిన్న వని ఆయన చెప్పుకొచ్చారు.వాతావరణ మార్పులను మనం తగ్గించగలం కానీ ఏఐ వల్ల వచ్చే ప్రమాదాలను మనం తగ్గించలేం అని ఆయన వాఖ్యనించారు.ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ అన్నది మానవ అస్తిత్వానికే ప్రమాదకరంగా మారే రోజు చాలా దగ్గరలోనే ఉందని ఆయన చెప్పుకొచ్చారు .వారెన్ బఫెట్,ఎలాన్ మస్క్ లాంటి అగ్ర వ్యాపారవేత్తలు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నురేగిస్తున్న విషయం తెలిసిందే.యూరోపియన్ యూనియన్ కూడా సాంకేతికత భవిష్యత్తు కార్యాచరణ పై ఒక శిఖరాగ్ర సమావేశం ఏర్పాటు చేయాలని అమెరికా అధ్యక్షుడు జో బయిడెన్ కోరుతుంది

Telugu Ai Threat, Big Threat, Chatgpt, Elon Musk, Hunter, Joe Biden, Warren Buff

ఈ రంగంతో సంబంధం లేని మేధావులు మాటలు ఎలా ఉన్నా టెక్నాలజీ రంగం లో నిపుణులు అనదగిన వారి వ్యాఖ్యలుతో పాటు ఇప్పుడు దీని తయారీతో సంబంధం ఉన్న హంటర్ లాంటి వారి వ్యాఖ్యలు చూస్తుంటే.మరి మానవ సౌలభ్యం కోసం వారి మేధో అవసరాల కోసం సృష్టించబడిన కృత్రిమ మేధస్సు మానవాభివృద్ధికి ఎంతగా సహాయపడుతుందో తెలియదు కానీ వారి వినాశనానికి , మానవ అస్తిత్వానికే ప్రమాదకరంగా మారుతుందని వస్తున్న వార్తలు దీని సీరియస్నెస్ ను తెలియజేస్తున్నాయి మరి ఇప్పటికైనా అంతర్జాతీయ నిపుణులు దీని నియంత్రణకై తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మానవ మనుగడే ఆగిపోయే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube