తాగిన మత్తులో తండ్రిని చంపిన కేసులో భారత సంతతికి చెందిన బ్రిటీష్ జాతీయుడిని కోర్ట్ దోషిగా తేల్చింది.వివరాల్లోకి వెళితే.
నిందితుడు 54 ఏళ్ల డీకాన్ సింగ్ విగ్ తన 86 ఏళ్ల తండ్రి అర్జున్ సింగ్ విగ్‌ను అక్టోబర్ 30, 2021 సాయంత్రం నార్త్ లండన్‌లోని సౌత్‌గేట్‌లోని తన నివాసంలో హత్య చేశాడు.దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకోగా.
డీకాన్ నగ్నంగా వుండటంతో పాటు అతని చుట్టూ 100 షాంపైన్ బాటిళ్లు కనిపించాయి.దీనికి తోడు అతని బట్టలు రక్తంతో తడిసి కనిపించాయి.
అయితే తాను తన తండ్రిని చంపానని.షాంపైన్ బాటిల్‌తో అతని తలను పగులగొట్టానని డీకాన్ నేరాన్ని అంగీకరించాడు.షాంపైన్ బాటిల్‌తో అర్జున్ సింగ్‌ను విచక్షణారహితంగా కొట్టడంతో అతనికి తీవ్రగాయాలు కావడంతో పాటు రక్తస్రావం కారణంగా వెంటనే చనిపోయారని ప్రాసిక్యూటర్ డీనా హీర్ కెసీ కోర్టుకు తెలియజేశారు.పోస్ట్‌మార్టం నివేదిక కూడా ప్రాసిక్యూటర్ వాదనలకు బలాన్ని చేకూర్చింది.
కుటుంబ వ్యాపారంలో తన తండ్రికి చేదోడు వాదోడుగా నిలిచిన డీకాన్.కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో మద్యానికి బానిస అయ్యాడు.ఘటనాస్థలి నుంచి 100 షాంపైన్ బాటిళ్లు, 10 అమెజాన్ డెలివరీ బాక్సులకు సరిపడా విస్కీ బాటిళ్లు, టాలిస్కర్ స్కాచ్ బాటిళ్లను కనుగొన్నారు.విచారణ సందర్భంగా తనకు ఆటిజం వుందని, అలాగే తనపై తండ్రి దాడి చేశాడని డీకాన్ చెప్పాడు.
హత్యకు ముందు తాను 500 ఎంఎల్ పరిమాణంలో విస్కీని సేవించినట్లు నిందితుడు అంగీకరించాడు.ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఏంజెలా రాఫెర్టీ విచారణను ఫిబ్రవరి 10కి వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.
అలాగే ఆరోజున డీకాన్‌కు శిక్షను ఖరారు చేసే అవకాశం వుంది.
ఇదిలావుండగా.నిర్లక్ష్యంగా కారు నడిపి ఓ భారతీయ మహిళ మరణానికి కారణమైన వ్యక్తికి యూకే కోర్ట్ గతవారం ఆరు సంవత్సరాల జైలు శిక్ష విధించింది.నిందితుడు అజీజ్ దాదాపు 100 కి.మీ వేగంతో వాహనాన్ని నడిపినట్లు దర్యాప్తులో తేలింది.గతేడాది నవంబర్‌లో వెస్ట్ మిడ్‌ల్యాండ్స్‌లో నిందితుడు నడుపుతున్న ఆడి 3 కారు.
బాధితురాలైన బల్జిందర్ కౌర్ మూర్ వాహనాన్ని వేగంగా ఢీకొట్టింది.ఆ సమయంలో నిందితుడి కారు 100 కి.మీ.బల్జీందర్ కౌర్ కారు 63 కి.మీ వేగంతో వున్నాయి.బాధితురాలు తన సోదరుడి ఇంటి నుంచి తన భర్తను తీసుకురావడానికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది.