వృద్ధులే టార్గెట్ .. భారీ మోసం: అమెరికాలో భారత సంతతి యువకుడిపై అభియోగాలు, రుజువైతే 20 ఏళ్ల జైలు

వృద్ధులను మోసం చేసి వారి వద్ద నుంచి దాదాపు 6 లక్షల డాలర్లు వసూలు చేసిన నేరంపై అమెరికా పౌరుడితో పాటు భారత సంతతికి చెందిన యువకుడిపై పోలీసులు అభియోగాలు మోపారు.నిందితులను రవి కుమార్, టెక్సాస్‌కు చెందిన ఆంథోనీ మునిగేటిలుగా గుర్తించారు.

 Indian National In Us Charged With Money Laundering, Wire Fraud , Indian Nationa-TeluguStop.com

వీరిద్దరిపై 20 కౌంట్ల కింద ఛార్జ్ షీట్ నమోదు చేశారు.కుమార్ భారతదేశంలో వున్నాడని అతనిని పరారీలో వున్న వ్యక్తిగా పరిగణిస్తున్నామని.

కుమార్ అరెస్ట్‌కు వారెంట్ వుందని అమెరికా న్యాయశాఖ మంగళవారం తెలిపింది.అయితే ఆంథోనిని మాత్రం అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించింది.

మునిగేటి, రవికుమార్‌లు మనీలాండరింగ్‌ కుట్రకు పాల్పడ్డారని.13 వైర్ ఫ్రాడ్‌లు, ఆరు మనీలాండరింగ్‌ కౌంట్ల కింద అభియోగాలు మోపారు.నేరం రుజువైతే ప్రతి కౌంట్ కింద గరిష్టంగా 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు 2,50,000 డాలర్ల జరిమానా విధించవచ్చు.ఛార్జ్ షీట్ ప్రకారం.ఈ కుట్ర మొత్తం టెక్సాస్‌లోని కాన్రో, భారత్‌లోని వివిధ ప్రాంతాల నుంచి నడిచింది.బాధితులకు టెక్నికల్ సపోర్ట్ అందిస్తున్నట్లు నటించి వీరిద్దరూ మోసాలకు పాల్పడి 6,00,000 డాలర్లను వసూలు చేసినట్లుగా తేల్చారు.

ఇక ఇదే రకమైన మాల్‌వేర్ ద్వారా అమెరికన్లను మోసం చేసిన హిమాన్షు అస్రీ అనే వ్యక్తికి గతేడాది మే నెలలో అమెరికా కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే.వృద్ధులను ల‌క్ష్యంగా చేసుకున్న హిమాన్షు కంప్యూటర్ వినియోగించేవారి స్క్రీన్లపై పాప్ అప్ ప్రకటనలు ఇచ్చేవాడు.

ఎవరైనా పొర‌పాటున ఆ యాడ్‌ను క్లిక్ చేస్తే చాలు.మీ కంప్యూటర్లలో వైరస్ చొరబడిందని.

సిస్టమ్ రిపేర్ కోసం ఫలానా నంబర్‌కు కాల్ చేయాల‌ని మెసేజ్ వచ్చేది.

దీంతో భయపడిపోయిన వినియోగ‌దారులు వెంట‌నే హిమాన్షు చెప్పిన నెంబర్‌కు కాల్ చేసేవారు.

అవన్నీ భారత్‌లో ఏర్పాటు చేసిన కాల్‌సెంట‌ర్స్‌కు వచ్చేవి.అక్కడి సిబ్బంది ముందుగా అనుకున్న పథకం ప్రకారం.

మాల్వేర్ నుంచి ర‌క్ష‌ణ కోసం త‌మ వ‌ద్ద ప్యాకెజీలు ఉన్నాయని నమ్మబలికేవారు.ఇందుకు గాను ఒక్కో వినియోగ‌దారుడి నుంచి దాదాపు 482 డాల‌ర్ల నుంచి 1000 డాల‌ర్ల వ‌ర‌కు వసూలు చేసేవారు.ఈ విధంగా హిమాన్షు ఐదేళ్లకాలంలో 6,500 మందిని మోసం చేసి వారి వద్ద నుంచి రూ.6.81 కోట్లు వ‌సూలు చేశాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube