క్రిప్టోకరెన్సీపై ఫోకస్.. యూఎస్ కాంగ్రెస్ సభ్యుడికి అడ్వైజర్‌గా భారత సంతతి ఎక్స్‌పర్ట్..!!

క్రిప్టో కరెన్సీ.ఇటీవలి కాలంలో బాగా వినిపిస్తున్న మాట.

 Indian-american To Advise Powerful Congressman On Crypto , Finance Minister Nirm-TeluguStop.com

అంతేకాదు, వీటి విలువ అమాంతం పైకి పెరుగుతోందనే వార్త‌లు కూడా వ‌స్తున్నాయి.ఈ క్ర‌మంలో క్రిప్టోకరెన్సీ గురించి తెలియ‌క‌పోయినా చాలామంది దానిలో పెట్టుబడులు పెట్టేందుకు ఎగబడుతున్నారు.

క్రిప్టో అనేది నిజానికి ఏ దేశానికి చెందిన క‌రెన్సీ కాదు.దీన్ని ఏ దేశం కూడా త‌యారు చేయ‌లేదు.

ఇదొక వ‌ర్చువ‌ల్ క‌రెన్సీ.దీన్నే డిజిట‌ల్ క‌రెన్సీ అని కూడా పిలుస్తారు.అంటే.కేవ‌లం ఇంట‌ర్నెట్‌లోనే ఈ క‌రెన్సీ చెల్లుబాటు అవుతుంద‌న్న‌మాట‌.అయితే దీని విలువ నానాటికీ పెరిగిపోతుండటంతో ఆయా దేశాలు క్రిప్టోకరెన్సీపై ఫోకస్ పెట్టాయి.దీనిని మారకంగా అనుమతిస్తున్నాయి కూడా.

భారత్ కూడా తాజా బడ్జెట్‌లో డిజిటల్ రూపీని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.అలాగే క్రిప్టో లావాదేవీలపై 30 శాతం పన్నును విధిస్తున్నట్లు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.

ఈ నేపథ్యంలో అమెరికాలో శక్తివంతమైన కాంగ్రెస్ సభ్యుడు పీట్ సెషన్స్ తన క్రిప్టో టెక్నికల్ వర్కింగ్ గ్రూప్‌కు సలహాదారుగా భారత సంతతి నిపుణుడిని నియమించుకున్నారు.తన క్రిప్టో టెక్నికల్ వర్కింగ్ గ్రూప్‌కు చీఫ్ ఎకనమిక్ డెవలప్‌మెంట్ , ఎనర్జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అడ్వైజర్‌గా భారత మూలాలున్న హిమాన్షు బి పటేల్‌ను నియమిస్తున్నట్లు పీట్ తెలిపారు.ఫైనాన్సియల్ డిజిటల్ టెక్నాలజీలు, ఎనర్జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్‌లో వినూత్న ప్రమాణాలను నెలకొల్పడంలో భారత్- అమెరికాలు ముందంజ వేయడం చాలా కీలకమని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

హిమాన్షు పటేల్‌తో కలిసి పనిచేస్తున్నందుకు తనకు చాలా సంతోషంగా వుందన్నారు.

పరిజ్ఞానం వున్న నిపుణులు , ప్రపంచస్థాయి నాయకుల మధ్య మెరుగైన సహకారం .వారి ప్రయత్నాలను ముందుకు తీసుకువెళుతుందని తాను విశ్వసిస్తున్నట్లు పీట్ తెలిపారు.పటేల్ స్పందిస్తూ. సెషన్స్ టీమ్‌లో, క్రిప్టో టెక్నికల్ వర్కింగ్ గ్రూప్‌లో తన నియామకం డిజిటల్ కరెన్సీ, క్రిప్టోకరెన్సీపై చర్చకు దారి తీస్తుందన్నారు.అలాగే ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి, గ్రీన్ వరల్డ్ పాలసీలకు ఉపయోగకరంగా వుంటుందని హిమాన్షు పటేల్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇక హిమాన్షు పటేల్ విషయానికి వస్తే.ఆయన భారత్‌ నుంచి ఈవీ ట్రక్కులు, కార్లను ఉత్పత్తి చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు.ఈ క్రమంలోనే ట్రిటాన్ ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను స్థాపించి.

దానికి ఎండీగా వ్యవహరిస్తున్నారు.ఈ తరహా ఆవిష్కరణలు పెరుగుతున్నందున….

ఇంధన, మౌలిక సదుపాయాల విషయంలో ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించే విధంగా అమెరికా, భారత్‌లు కలిసి పనిచేయడంపై దృష్టి సారిస్తానని పటేల్ స్పష్టం చేశారు.

Indian-American To Advise Powerful Congressman On Crypto , Finance Minister Nirmala Sitharaman, Crypto, Member Of Congress Pete Sessions, Himanshu B Patel, Crypto Technical Working Group, - Telugu Crypto, Himanshu Patel, Indianamerican, Membercongress

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube