అమెరికాలో ప్రమాదవశాత్తు మృతి చెందిన భారత సంతతి మెడికల్ స్టూడెంట్

అమెరికాలో మెడిసన్ చదువుతున్న భారత సంతతి మెడికల్ స్టూడెంట్ వివేక్ సుబ్రమణి ప్రమాదవశాత్తు మృతి చెందాడు.వాషింగ్టన్‌లోని ఫిలాడెల్ఫియాలో ఈ ఘటన జరిగింది.

 Indian American Medical Student Falls To Death In Philadelphia-TeluguStop.com

వివేక్ నివాసముంటున్న అపార్ట్‌మెంట్ బిల్డింగ్‌ పైన జనవరి 11న రాత్రి ఇద్దరు స్నేహితులతో కలిసి వెళ్లాడు.బిల్డింగ్‌ పైనున్న రూఫ్ టాప్‌లపై ముగ్గురూ దూకడానికి ప్రయత్నించారు.

అదే సమయంలో వివేక్ అదుపుతప్పి కిందకు పడిపోయాడు.దీంతో తీవ్ర గాయాలకి గురైన వివేక్ ని స్నేహితులు థామస్ జెఫర్‌స్ యూనివర్శిటీ హాస్పిటల్ కి తీసుకెళ్ళారు.

అక్కడ చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు.

వివేక్ మరణవార్త విన్న కుటుంబసభ్యులు దుఖంలో మునిగిపోయారు.

డాక్టర్‌గా చూడాలనుకున్న కొడుకు ఇలా మధ్యలోనే తమ ఆశ ఆవిరి చేసి తమకి తీవ్ర వేదన మిగిల్చాడని దుఖంలో మునిగిపోయారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఫిలాడెల్ఫాయా పోలీసులు విచారణ చేపట్టారు.

ఈ ప్రమాదం జరిగే కొద్ది గంటల క్రితం వివేక్ అతడి స్నేహితులతో కలిసి మద్యం సేవించినట్టు పోలీసులు చెబుతున్నారు.కాగా.వివేక్ డ్రెగ్జిల్ మెడికల్ కాలేజీలో వైద్యవిద్యను అభ్యసిస్తున్నాడు.డాక్టర్ అవ్వాలనుకున్న అతడి కల ఇలా ముగుస్తుందని అనుకోలేదంటూ తోటి విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube