కొన్ని సంవత్సరాల క్రితం ఈ స్మార్ట్ ఫోన్లు లేని రోజులలో మోసాలు అంటే పిక్ పాకెట్ చేయడం, ఏదో పెద్ద పెద్ద దొంగతనాలు చేయడం లాంటివి కొంత మంది నేరగాళ్లు చేసేవారు.కానీ ఈ మధ్య కాలంలో ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉండి స్మార్ట్గా దోచేస్తున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది మోసగాళ్లు ఎంతో స్మార్ట్ గా ఘరానా మోసాలకు పాల్పడుతున్నారు.తాజా గా అమెరికాలో ఉన్న ఒక భారతీయ అమెరికన్ బరమా శివన్నారాయణ ఒక భారీ ఘరానా మోసం చేశాడు.
బర్మా శివన్నారాయణ అనే భారతీయ అమెరికన్ ఐటీ నిపుణుడు ఒక కంపెనీ అంతర్గత సమాచారాన్ని అక్రమంగా సంపాదించి స్టాక్ మార్కెట్లో 73 లక్షల డాలర్ల లాభాల ను సాధించినట్లు రుజువు అయింది.
ఈ భారతీయ అమెరికన్ కు దాదాపు 25 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉందని న్యూయార్క్ మీడియా వెల్లడించింది.
శివన్నారాయణ కాలిఫోర్నియా రాష్ట్రం లోని సిలికాన్ వ్యాలీ లో చాలా ఐటి కంపెనీలలో పని చేశాడు.తర్వాత ఫాలో అల్ట్రా నెట్వర్క్ అనే కంపెనీకి కాంట్రాక్టర్ గా పని చేస్తున్నాడు.
ఈ సమయంలో సంస్థ ఐటీ విభాగంలో పనిచేసే ఒక ఎంప్లాయ్ తో శివన్నారాయణకు మంచి స్నేహం ఏర్పడి ఉంది.
ఆ ఎంప్లాయ్ ద్వారా కంపెనీ 6 నెలల ఆర్థిక లావాదేవీలను అందరి కన్నా ముందే సంపాదించాడు.దాని ఆధారంగా ఫలితాల వెల్లడి ముందు స్టాక్ మార్కెట్లో ఆ కంపెనీ షేర్లలో పెట్టుబడి పెట్టాడు.2016 అక్టోబర్ నుంచి 2017 సెప్టెంబర్ వరకు శివన్నారాయణకు తమ కంపెనీ ఆర్థిక సమాచారాన్ని నేనే అందించానని ఆ ఎంప్లాయ్ కూడా ఒప్పుకున్నాడు.ఈ ఇన్ఫర్మేషన్ ను ఉపయోగించిన శివన్నారాయణ స్టాక్ మార్కెట్లో ఎక్కువ మొత్తంలో లాభాలను సంపాదించినట్లు ఆధారాలు ఉన్నాయి.