అగ్ర రాజ్యానికి పెరుగుతున్న భారత విద్యార్ధుల వలసలు...!!!

అమెరికాలో చదువుకుని అక్కడే స్థిరపడాలని ఎంతో మంది విద్యార్ధులు కోరుకుంటారు.అమెరికాలో ఉద్యోగం చదువు అంటే భవిష్యత్తు బాగుంటుందని ఆర్ధికంగా స్థిరపడవచ్చుననే కోరికతో ఎంతో మంది తల్లి తండ్రులు అప్పులు చేసయినా సరే తమ పిల్లలను అమెరికా పంపుతూ ఉంటారు.

 Increasing Migration Of Indian Students To America , Indian Students , America-TeluguStop.com

అయితే కరోనా తరువాత అమెరికా పెట్టిన ఆంక్షల నేపధ్యంలో వలసలు వెళ్ళే వారి సంఖ్యలో మార్పులు చోటు చేసుకున్నాయి.భారతీయ విద్యార్ధుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది.

ఈ క్రమంలోనే కరోనా తగ్గుముఖం పట్టడంతో అమెరికా వలస వాసులపై విధించిన ఆంక్షలు సడలించడంతో మళ్ళీ భారత్ నుంచీ వచ్చే విద్యార్ధుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది.

ఈ మేరకు అమెరికా సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగేషన్ సర్వీస్ తాజాగా కీలక ప్రకటన చేసింది.

గతంలో అమెరికాకు వచ్చే వలస విద్యార్ధులలో అత్యధిక శాతం చైనావిద్యార్ధులు ఉండేవారిని అయితే ప్రస్తుతం వారి సంఖ్య అమాంతం తగ్గిపోగా భారతీయ విద్యార్ధుల సంఖ్య గతంలో పోల్చితే భారీగా పెరిగినట్టుగా గణాంకాలతో సహా వెల్లడించింది.

Telugu America, Brazil, Canada, China, Citizenship, Corona, Indian, Korea-Telugu

సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగేషన్ సర్వీస్ లెక్కల ప్రకారం 2021 లో ఎఫ్ -1 ఏం -1 వీసాల ద్వారా అమెరికాలో చదువుకుంటున్న విద్యార్ధుల సంఖ్య దాదాపు 12 లక్షల పై చీలుకే ఉండేదని ఈ సంఖ్య 2020 నాటికి పోల్చితే తక్కువేనని అయితే ప్రత్యేకించి భారతీయ విద్యార్ధుల సంఖ్య మాత్రం 2020 తో పోల్చితే 2021 నాటికి 12 శాతం పెరిగిందని వెల్లడించింది.ఈ క్రమంలో చైనా విద్యార్ధుల సంఖ్య సుమారు 8 శాతానికి పడిపోయిందని తెలుస్తోంది.భారత చైనాల తరువాత అమెరికాకు క్యూ కడుతున్న దేశాలలో దక్షిణ కొరియా , కెనడా, బ్రెజిల్ దేశాలు ఉన్నాయని అమెరికా ఇమ్మిగేషన్ సర్వీస్ వెల్లడించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube