పాతకాలం నాటి చాక్లెట్లు తినాలా.. ఈ ప్రాంతానికి వెళ్లండి!

1980, 90లో కాలంలో చాక్లెట్లు, బిస్కెట్లు, ఇంకా రకరకాల స్వీట్లు అప్పటి జనరేషన్ వారిని ఎంతగానో ఆకట్టుకున్నాయి.అవి చాలా రుచిగా ఉంటూ మళ్లీ మళ్లీ తినాలనిపించేంత గొప్పగా ఉండేవి.

 If You Want To Eat Old Fashioned Chocolates.. Go To This Place Chocolates, Old A-TeluguStop.com

అయితే గొప్ప టేస్ట్ అందించే ఈ ఐటమ్స్ ఇప్పుడు మార్కెట్లలో లభించడం లేదు.అయితే తమిళనాడులోని మధురైలో మాత్రం ఒక దుకాణంలో పాతకాలం నాటి తినుబండారాలన్నీ దొరుకుతున్నాయి.

తెప్పకులం ఏరియాలో ఉన్న ఈ షాప్ చిన్నగానే ఉంటుంది కానీ ఇందులో 40 ఏళ్ల క్రితం పాపులర్ అయిన మమ్మీ డాడీ, ఆశ చాక్లెట్, పుల్ల ఐసు, మామిడి తాండ్ర, పీచు మిఠాయి, పల్లీ కోడి గుడ్డు, పేపర్ అప్పడం, పేపర్ బిస్కెట్, పాలకోవా, కలర్ జెల్లీలు ఇలా అన్నీ దొరుకుతాయి.

ఈ ఐటమ్స్ అందించే రుచి చాలా డిఫరెంట్ అని చెప్పొచ్చు.

కొన్ని తీయగా, మరికొన్ని కాస్త పుల్లగా ఉంటూ చవులూరిస్తుంటాయి.అప్పట్లో పిల్లలు కోసం ఈ తినే ఐటమ్స్ తో పాటు ఆడుకునే బొమ్మలు కూడా ఇచ్చేవారు.

వాటికోసం పిల్లలందరూ ఈ ఐటమ్స్ కొనుగోలు చేసి హాయిగా తినేసి వాటితో ఆడుకునేవారు.ఆ బాల్యపు తీపి జ్ఞాపకాలను మళ్లీ నెమరు వేసుకోవాలనుకునే వారికి ఈ షాపు బాగా హెల్ప్ అవుతుంది.

ఇంకా విశేషమేంటంటే 1990లో లభించిన క్యాండీస్ ఈ షాపులో హోల్‌సేల్, రిటైల్‌గా దొరుకుతాయి.ఇక్కడ మీరు విజిల్ క్యాండీ, క్రేజీ పాప్ క్యాండీ, క్యుమిన్ క్యాండీ, స్టిక్ క్యాండీ, టిట్ బిట్స్‌లతో పాటు రకరకాల ఐటమ్స్ పొందొచ్చు.ఈ ఐటమ్స్‌ను ఎరోడ్ జిల్లాలోని తమ ఇంటి వద్ద తయారు చేస్తున్నట్లు ఓనర్ తెలిపాడు.చిన్నపిల్లలే కాకుండా పెద్దది కూడా వీటిని కొనుగోలు చేసి ఆనాటి రుచులను ఆస్వాదిస్తున్నారని ఆయన అన్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube