లాక్‌డౌన్ ఆంక్ష‌ల‌ను విస్మరిస్తే తాట తీస్తున్న తెలంగాణ పోలీసులు.. ఇకనుండి ఇంతేనట.. !

ఇప్పటి వరకు తెలంగాణలో అమలైన లాక్‌డౌన్ ఒక ఎత్తు ఇప్పటి నుండి అమలైయ్యే లాక్‌డౌన్ ఒక ఎత్తు.అంటున్నారు తెలంగాణ పోలీసులు.

 If The Lockdown Restrictions Are Ignored The Telangana Police Will Take Action T-TeluguStop.com

అసలు లాక్‌డౌన్ పెట్టిందే కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికి, కానీ ఈ నిబంధనలను ప్రజలు దాదాపుగా పాటించడం లేదని గులాభి దొర పోలీస్ డిపార్ట్‌మెంట్ కు ఇంకా ఎక్కువ అధికారాలు ఇచ్చారట.

ఇంకే ముంది ఈ లాక్‌డౌన్ నిబంధనలను కఠినంగా అమలు అయ్యేలా చర్యలు చేపట్టాలని తెలంగాణ డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి ఆదేశించారట.

దీంతో మరింత అప్రమత్తం అయినా అధికారులు ఉద‌యం 10 గంట‌ల నుంచి మ‌రుస‌టి రోజు ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు తెలంగాణ‌ రాష్ట్ర స‌రిహ‌ద్దుల‌ను పూర్తిగా మూసివేయ‌బోతున్నారట.స‌రిహ‌ద్దు దాటి ఒక్క‌రు కూడా రాష్ట్రంలోకి రాకుండా బ‌య‌ట‌కు వెళ్ల‌కుండా ఆంక్ష‌లు అమలు చేయనున్నట్లుగా డీజీపీ తెలుపుతున్నారట.

ఇక ఏ వాహ‌నం అయినా ఉద‌యం 10 గంట‌ల త‌ర్వాత రోడ్డుపై క‌న‌బ‌డినా సీజ్ చేస్తామ‌ని, లాక్‌డౌన్ త‌ర్వాత కోర్టుకు వ‌చ్చి సీజ్ చేసిన వాహ‌నాలు తీసుకోవలసి ఉంటుందని తెలుపుతున్నారు పోలీసులు కాబట్టి ప్రజలు బయటకు రాకుండా ఉంటే మంచిదని వెల్లడిస్తున్నారు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube