జబర్దస్త్ షో ద్వారా ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించి పాపులర్ అయిన కమెడియన్లలో హైపర్ ఆది( Hyper Aadi ) ఒకరు.పైకి నవ్వుతూ కనిపించే హైపర్ ఆది ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎన్నో కష్టాలు ఉన్నాయి.
ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన హైపర్ ఆది ఆ ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలను చెప్పుకొచ్చారు.మా నాన్నగారు బ్రహ్మం గారి నాటకాలలో సిద్ధయ్య పాత్రలో చేస్తారని తెలిపారు.
బీటెక్ లో నాకు 80 శాతం వచ్చిందని 20 వేల జీతానికి ఒక కంపెనీలో పని చేశానని హైపర్ ఆది అన్నారు.మా నాన్న ముగ్గురిని చదివించడానికి 20 లక్షల రూపాయలు ఖర్చు చేశారని ఆ డబ్బులో ఎక్కువ మొత్తం అప్పు అని హైపర్ ఆది తెలిపారు.నా 20,000 జీతంతో అప్పు తీర్చడం సాధ్యం కాదని మూడు ఎకరాల పొలం అమ్మించానని హైపర్ ఆది కామెంట్లు చేశారు.
యూట్యూబ్( YouTube ) వీడియో ద్వారా నాకు అదిరే అభి( Adhire Abhi ) మెసేజ్ చేశారని హైపర్ ఆది తెలిపారు.జాబ్ మానేసిన తర్వాత ఆర్థిక ఇబ్బందుల వల్ల కొంతకాలం పాటు తెలిసిన వాళ్ల లేడీస్ హాస్టల్ లో ఒక రూంలో ఉన్నానని ఆ సమయంలో చాలా ఇబ్బందులు పడ్డానని ఆయన కామెంట్లు చేశారు.హైపర్ ఆది తర్వాత రోజుల్లో అమ్మిన పొలం కంటే ఎక్కువ పొలాన్ని కొనుగోలు చేయడం గమనార్హం.
హైపర్ ఆది నెల ఆదాయం 10 లక్షల రూపాయలు, అంతకంటే ఎక్కువ మొత్తమని తెలుస్తోంది.హైపర్ ఆది కెరీర్ పరంగా మరింత సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
హైపర్ ఆదిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతుండగా యూట్యూబ్ లో హైపర్ ఆది వీడియోలకు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి.హైపర్ ఆది ఎంతో కష్టపడటం వల్లే ఈ స్థాయిలో సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు.