ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని పెళ్లి చేసుకున్నాడు.. చివరికి పరీక్షల్లో ఫెయిల్ అయ్యిందని భార్యను....

ఈ మధ్య కాలంలో కొందరు ప్రేమ, పెళ్ళి వంటి బంధాలను డబ్బుతో ముడిపెడుతూ వాటిని అపహాస్యం చేస్తున్నారు.అంతేకాకుండా కష్ట పడకుండా వచ్చేటువంటి డబ్బుపై వ్యామోహం పెంచుకుని కట్టుకున్న వారిని సైతం కష్టాల పాలు చేయడానికి ఏ మాత్రం వెనుకాడడం లేదు.

 Husband Family Tortured To The Wife For Govt Exam Fail, Rajasthan, Govt Job, Pre-TeluguStop.com

తాజాగా ఓ వ్యక్తి తన భార్యకి గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందనే ఆశతో పెళ్లి చేసుకొని చివరికి తన భార్యకి గవర్నమెంటు ఉద్యోగం రాకపోవడంతో ఇంటి నుంచి గెంటేసిన ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో వెలుగు చూసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలో జుంజాన పట్టణ పరిసర ప్రాంతంలో “ఉషా కుమారి” అనే వివాహిత తన కుటుంబ సభ్యులతో నివాసముంటుంది.

ఇటీవలే ఉషా కుమారికి తన దగ్గరి బంధువులయిన ఓ వ్యక్తితో వివాహం జరిగింది.అయితే ఉషా కుమారి కుటుంబ సభ్యులు కొంతమేర పేదవాళ్లు అయినప్పటికీ ఉషా కుమారి ని బాగా చదివించడంతో ఉద్యోగం వస్తుందనే కారణంగా తన భర్త పెళ్లి చేసుకున్నాడు.

దీనికితోడు అప్పుడప్పుడే ఉషా కుమారి గవర్నమెంట్ ఉద్యోగం కోసం నిర్వహించే ప్రిలిమ్స్ పరీక్షలలో ఉత్తీర్ణత చెందింది.దీంతో తన భర్త చాలా సంబరపడ్డాడు.కానీ ఆ సంబరం ఎంతోకాలం నిలవలేదు.అయితే ప్రిలిమ్స్ తర్వాత నిర్వహించే మెయిన్స్ పరీక్షలో ఉషా కుమారి ఫెయిల్ అయింది.

దీంతో ఆమె గవర్నమెంట్ ఉద్యోగానికి అర్హత సాధించలేక పోయింది.

ఇక అప్పటినుంచి ఉషా కుమారికి తన అత్త ఇంట్లో కష్టాలు మొదలయ్యాయి.

ఈ క్రమంలో అప్పటి వరకు తనను కన్న కూతురిలా భావించిన అత్తామామలు ఒక్కసారిగా నరకం చూపించడం మొదలు పెట్టారు.దీనికితోడు భర్త కూడా తన తల్లిదండ్రులకు సహకరించడంతో ఈ కష్టాలు రోజురోజుకీ ఎక్కువయ్యాయి.

దీంతో ఉషా కుమారి తన తల్లిదండ్రులతో అత్తమామలు ఆగడాల గురించి చెప్పి బోరున విలపించింది.దాంతో ఉషా కుమారి తల్లిదండ్రులు ఆమెను వెంటబెట్టుకొని దగ్గరలో ఉన్నటువంటి పోలీసులను సంప్రదించి తన భర్త మరియు కుటుంబ సభ్యులు ఆగడాల గురించి ఫిర్యాదు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube