Mahesh babu trivikram: మహేష్ త్రివిక్రమ్ ఫ్యాన్స్ కు భారీ షాక్.. పూర్తిగా కథనే మార్చేశారా?

మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబో మూవీకి సంబంధించిన ప్రకటన వచ్చి ఏడాదిన్నర కాగా ఈ సినిమాకు సంబంధించి వైరల్ అవుతున్న ఎన్నో వార్తలు మహేష్ బాబు అభిమానులను తెగ టెన్షన్ పెడుతున్నాయి.సర్కారు వారి పాట అబవ్ యావరేజ్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న నేపథ్యంలో త్రివిక్రమ్ సినిమాపై ప్రత్యేక దృష్టి పెట్టిన మహేష్ బాబు ఈ సినిమా కథను పూర్తిగా మార్చిన తర్వాతే సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధమయ్యారని బోగట్టా.

 Huge Shock To Mahesh Babu Trivikram Fans Details, Mahesh , Trivikram, Mahesh Bab-TeluguStop.com

సెట్స్ పైకి వెళ్లీ కొంతభాగం షూట్ జరుపుకున్న మూవీ కథ మార్చడం అంటే ఒక విధంగా విచిత్రమే అని చెప్పాలి.అయితే ఈ విషయాలు బయటకు లీక్ కాకుండా ఉండాలని మేకర్స్ భావిస్తున్నారు.

మారిన కథ ప్రకారం సినిమాలోని నటీనటులకు సంబంధించి కూడా మార్పులు చేశారని తెలుస్తోంది.డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూట్ జరగనుందని తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ సినిమాలో కొంతమంది నటులను మేకర్స్ తొలగిస్తున్నారని బోగట్టా.

హీరోయిన్ విషయంలో ఎలాంటి మార్పు లేదని మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో మాత్రం మార్పు జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Telugu Haarika Hassine, Mahesh, Maheshbabu, Ssmb, Trivikram-Movie

హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుండగా కథలో మార్పుల వల్ల ఈ సినిమా బడ్జెట్ మరింత పెరిగే అవకాశం అయితే ఉంటుందని కూడా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

ఈ సినిమాను ప్రకటించిన డేట్ కు రిలీజ్ చేయడం ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.త్రివిక్రమ్ ఇతర సినిమాలపై కూడా దృష్టి పెడుతుండటంతో సొంత ప్రాజెక్ట్ లపై ప్రభావం పడుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఈ కామెంట్లపై త్రివిక్రమ్ నుంచి ఎలాంటి అభిప్రాయం వినిపిస్తుందో చూడాల్సి ఉంది.

ఈ సినిమా పారితోషికాలకే 120 కోట్ల రూపాయలు ఖర్చవుతోందని బోగట్టా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube