తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రిలో భక్తుల రద్దీ నెలకొంది.వరుస సెలవులు రావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి.
స్వామివారి దర్శనానికి భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు.కాగా స్వామి వారి ఉచిత దర్శనానికి రెండు గంటల సమయం పడుతుంది.
ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతుండటంతో భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు.మరోవైపు కొండ కింద వాహనాలు పార్కింగ్ కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
పార్కింగ్ స్థలం సరిపోక పోవడంతో.ఆలయ అధికారుల తీరుపై భక్తులు మండిపడుతున్నారు.
ఆలయంలో సరైన ఏర్పాట్లు చేయడం లేదని విమర్శిస్తున్నారు.