భారత్ - అమెరికా సంబంధాలు .. మరోసారి మద్ధతిచ్చిన యూఎస్ హౌస్ స్పీకర్ మెక్ కార్ధీ

అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ కెవిన్ మెక్‌కార్దీ. భారత్-అమెరికా సంబంధాలకు ఎప్పుడూ తన మద్ధతు వుంటుందన్నారు.

 House Speaker Mccarthy Re-conveys His Support For Stronger Indo America Ties Det-TeluguStop.com

కాలిఫోర్నియా రాష్ట్రానికి చెందిన భారతీయ-అమెరికన్ నిర్వహించిన రిసెప్షన్‌లో భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధుకు స్వాగతం పలికారు మెక్‌కార్దీ.అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్.

ఏదైనా కార్యక్రమంలో విదేశీ రాయబారికి స్వాగతం పలకడం అత్యంత అరుదు.శుక్రవారం ఇండియన్ వెల్స్ నగరంలో భారతీయ కమ్యూనిటికీ చెందిన నచ్చత్తర్, సుసానా చాందీలు ఈ రిసెప్షన్ ఇచ్చారు.

ఈ కార్యక్రమానికి రౌల్ రూయిజ్ (డెమోక్రటిక్), జాన్ డువార్టే (రిపబ్లికన్), జే ఒబెర్నోల్టే (రిపబ్లికన్), పాల్ కుక్ (రిపబ్లికన్),

జో బాకా (డెమొక్రాట్) వంటి పలువురు కాంగ్రెస్ సభ్యులు సహా 500 మందికి పైగా హాజరయ్యారు.కాలిఫోర్నియా హౌస్ స్పీకర్ ఆంథోనీ రెండన్‌తో పాటు పలువురు శాసనసభ్యులు, న్యాయమూర్తులు, న్యాయవాదులు, పలువురు ప్రవాస భారతీయులు కూడా ఈ విందుకు విచ్చేశారు .ఈ సందర్భంగా మెక్ కార్దీ మాట్లాడుతూ.రాబోయే రోజుల్లో బలమైన భారత్-అమెరికా సంబంధాల కోసం తన మద్ధతును మరోసారి తెలియజేశారు.

గతంలోనూ ఆయన ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి కృషి చేశారు.భారత రాయబారి సంధు మాట్లాడుతూ.

రాజకీయాలు, ఆర్ధిక వ్యవస్థతో సహా అన్ని రంగాల్లో గత 75 సంవత్సరాల్లో భారతదేశ ప్రయాణాన్ని హైలైట్ చేశారు.

Telugu Mccarthy, Indo America, Kevin Mccarthy, Taranjitsingh, America-Telugu NRI

ఇకపోతే.గత నెలలో అమెరికా ప్రతినిధుల సభ కొత్త స్పీకర్‌గా రిపబ్లికన్ పార్టీకి చెందిన కెవిన్ మెక్‌కార్థీ ఎన్నికైన సంగతి తెలిసిందే.స్పీకర్ ఎన్నికు సంబంధించిన ఓటింగ్‌పై గత కొన్నిరోజులుగా ప్రతిష్టంభన నెలకొన్న సంగతి తెలిసిందే.

ఎట్టకేలకు 15వసారి నిర్వహించిన ఓటింగ్‌లో కెవిన్ విజయం సాధించారు.అయితే డెమొక్రాటిక్ పార్టీకి చెందిన ప్రత్యర్ధి హకీం సెకూ జెఫ్రీస్ తన ఎన్నికకు కావాల్సిన మెజారిటీని సాధించలేకపోయారు.

మొత్తం మీద 216 – 212 ఓట్ల తేడాతో కెవిన్ విజయం సాధించారు.

Telugu Mccarthy, Indo America, Kevin Mccarthy, Taranjitsingh, America-Telugu NRI

అమెరికాలోని ప్రోటోకాల్ ప్రకారం.దేశాధ్యక్షుడు, ఉపాధ్యక్షుడి తర్వాతి హోదాలో స్పీకర్ నిలుస్తారు.హౌస్ ఎజెండా, లెజిస్లేటివ్ బిజినెస్ మొత్తం స్పీకర్ నియంత్రణలో వుంటుంది.

అందువల్లే అమెరికా రాజకీయాల్లో ప్రతినిధుల స్పీకర్‌కు తిరుగులేని ప్రాధాన్యత వుంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube