మందులు అవసరం లేకుండా ఇంటి నివారణలతో బిపిని తగ్గిచుకోవచ్చా....ఎలా?  

Home Remedies For High Blood Pressure -

ప్రస్తుతం ప్రపంచంలో బీపీ తో బాధపడేవారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉంది.మారిన జీవనశైలి, సరైన వ్యాయామం లేకపోవటం, ఆహారంలో ఉప్పు ఎక్కువగా తీసుకోవటం, మధ్యం తీసుకోవటం వంటి కారణాలతో బీపీ బారిన పడుతున్నారు.

అయితే బిపిని అదుపులో ఉంచుకోవటానికి కొన్ని ఇంటి చిట్కాలు ఉన్నాయి.వాటి గురించి తెలుసుకుందాం

Home Remedies For High Blood Pressure-Telugu Health-Telugu Tollywood Photo Image

టమోటాలో విటమిన్ ఇ ,లైకోపిన్ వంటి యాంటీ యాక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన బిపికి కారణం అయ్యే ఫ్యాటి యాసిడ్స్ దమనులలో నిల్వ లేకుండా చేస్తుంది.

తాజా టమోటా ముక్కలు లేదా తాజా టమోటా జ్యూస్ తీసుకోవాలి

వెల్లుల్లి బీపీని తగ్గించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.రక్తంలోని సోడియంను కిడ్నీలోకి నెట్టి బీపీని తగ్గించటంలో చాలా బాగా పనిచేస్తుంది.

వెల్లుల్లిని సలాడ్స్,కూరల్లోనూ వేసుకొని తినవచ్చు

బీట్రూట్ శరీరానికి అవసరమైన నైట్రేట్స్ ని సరఫరా చేస్తుంది.ఇవి బిపిని తగ్గించటానికి సహాయపడతాయి.

అందువల్ల వారంలో మూడు సార్లు బీట్ రూట్ ని సలాడ్ రూపంలో తీసుకుంటే మంచిది.బీట్ రూట్ తినటం చాలా మందికి ఇష్టం ఉండదు.

అటువంటి వారు జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు.

బిపిని తగ్గించటంలో నీరు కూడా కీలకమైన పాత్రను పోషిస్తుంది.నీరు ఎక్కువగా త్రాగితే శరీరంలో ఎక్కువగా ఉన్న సోడియం కంటెంట్ బయటకు పోతుంది.దాంతో బీపీ తగ్గుతుంది

అరటిపండులో పొటాషియం సమృద్దిగా ఉండుట వలన బిపిని తగ్గించటంలో సహాయపడుతుంది.

అంతేకాక పొటాషియం కిడ్నీల పనితీరులో కీలకమైన పాత్రను పోషిస్తుంది.అరటిపండును ప్రతి రోజు ఆహారంలో బాగంగా చేసుకుంటే బిపిని సులభంగా తగ్గించుకోవచ్చు

బిపికి కారణం అయిన ఉప్పును తగ్గించాలి.

అంటే ప్రొసెస్ చేసిన ఆహారాలు,జంక్ ఫుడ్స్ కి దూరంగా ఉండాలి.వీటిలో ఉప్పు అధికంగా ఉంటుంది.

డార్క్ చాక్లెట్ లో ఫ్లెవనాల్స్ సమృద్దిగా ఉంటాయి.ఇవి బిపిని తగ్గించటంలో బాగా సహాయపడతాయి.అలాగే కార్డియో వ్యాస్క్యులర్ డిసీజ్ ను దూరం చేయటంలో సహాయపడుతుంది.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు