చంద్రబాబు నమ్మదగిన వ్యక్తి కాదు..: జూ.ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు

సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ మామ, వైసీపీ నేత నార్నె శ్రీనివాస రావు( Narne Srinivasa Rao ) కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

 Chandrababu Is Not A Trustworthy Person..: Junior Ntr's Uncle Narne Srinivasa Ra-TeluguStop.com

చంద్రబాబు( TDP Leader Chandrababu ) నమ్మదగిన వ్యక్తి కాదని నార్నె శ్రీనివాస రావు తెలిపారు.అందుకే ఏపీ ప్రజలు సైతం ప్రస్తుతం చంద్రబాబును నమ్మడం లేదన్నారు.

రానున్న ఎన్నికల్లో చంద్రబాబు సొంత బలంతో గెలిచే శక్తి కూడా లేదని విమర్శించారు.సొంతంగా గెలవలేమని తెలిసే బీజేపీ, జనసేనతో పొత్తు( BJP Janasena ) పెట్టుకుని ఎన్నికలకు వెళ్తున్నారని ఎద్దేవా చేశారు.

అయితే ప్రజలే చంద్రబాబును నమ్మని పరిస్థితుల్లో పొత్తులతో వెళ్లినా ఆయన గెలవడం కష్టమేనని నార్నె శ్రీనివాసరావు వ్యాఖ్యానించారని సమాచారం.నార్నె శ్రీనివాసరావు చంద్రబాబు కుటుంబానికి అత్యంత దగ్గర బంధువు అన్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో( AP Politics ) చర్చనీయాంశంగా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube