నోకియా 225 4G స్మార్ట్ ఫోన్ డిజైన్, స్పెసిఫికేషన్ వివరాలు లీక్..!

నోకియా 225 4G స్మార్ట్ ఫోన్ డిజైన్( Nokia 225 4G smartphone ), స్పెసిఫికేషన్ వివరాలు ఆన్లైన్ లో లీక్ అయ్యాయి.ఆ వివరాలు ఏమిటో చూద్దాం.

 నోకియా 225 4g స్మార్ట్ ఫోన్ డిజైన�-TeluguStop.com

నోకియా 225 4G స్మార్ట్ ఫోన్:

ఈ ఫోన్ నంబర్ ప్యాడ్ తో 2.4 అంగుళాల డిస్ ప్లే తో ఉంటుంది.S30+OS పై పని చేస్తుంది.ఈ ఫోన్ ఫ్లాష్ లైట్ తో పాటు వెనుక వైపు ఒకే కెమెరా సెన్సార్ తో రానుంది.

ఈ ఫోన్ వెనుక వైపు VGA కెమెరా లేదా 3-మెగా పిక్సెల్ కెమెరా తో వస్తోంది.ఈ ఫోన్ 1450mAh బ్యాటరీ సామర్థ్యం తో ఉంటుంది.USB టైప్-C పోర్టు, 3.5mm హెడ్ ఫోన్ జాక్ ను కలిగి ఉంటుంది.స్టోరేజ్ విషయానికి వస్తే.64MB RAM+128MB స్టోరేజ్ తో రానుంది.ఈ ఫోన్ ధర విషయానికి వస్తే.100 EURO అంటే మన భారత కరెన్సీలో దాదాపుగా రూ.8000 గా ఉండే అవకాశం ఉంది.

ఈ ఫోన్ ఈనెల చివరలో యూరప్ ఆఫ్రికా( Africa, Europe ) లాంటి ప్రాంతాల్లో అధికారికంగా లాంచ్ అయ్యే అవకాశం ఉంది.US విడుదల అయ్యే అవకాశం లేదు.లాంచింగ్ సమయంలో అన్ని వివరాలు కంపెనీ వెల్లడించనుంది.

నోకియా N90 స్మార్ట్ ఫోన్( Nokia N90 ) త్వరలోనే గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అయ్యేందుకు సిద్ధమైంది.ఈ ఫోన్ ప్రత్యేకమైన ఫ్లిప్ డిజైన్ ను కలిగి ఉంది.ఈ ఫోన్ డిజైన్ ఎంతో ఆకర్షణీయకంగా ఉందని, విడుదల అనంతరం ఈ ఫోన్ కు మంచి ఆదరణ లభించే అవకాశం ఉంది.ఈ ఫోన్ వెనుక ప్యానెల్ లో ఆకర్షణీయమైన LED స్ట్రిప్స్ ఉన్నాయి.

ఈ ఫోన్లో క్లాసిక్ D9 కీబోర్డ్ సపోర్ట్ కూడా ఉంది.డ్యూయల్ డిస్ ప్లే సదుపాయం కలిగి వంగిన డిస్ ప్లే తో వస్తోంది.100ఎంపీ కెమెరాతో ఉంటుంది.ఈ ఫోన్ ధర వివరాలతో పాటు మిగతా ఫీచర్లు లాంచింగ్ సమయంలో కంపెనీ వెల్లడించనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube