తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికు( CM Revanth Reddy ) మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు( Harish Rao ) ఛాలెంజ్ చేశారు.ఆగస్ట్ 15 లోగా ఏకకాలంలో రుణమాఫీ చేసి ఆరు గ్యారెంటీలు( Six Guarantees ) అమలు చేస్తే నేను రాజీనామా చేస్తానని తెలిపారు.
అంతేకాకుండా మరోసారి ఎన్నికల్లో పోటీ చేయనని హరీశ్ రావు స్పష్టం చేశారు.రుణమాఫీ, ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే రాజీనామా చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమా అని ప్రశ్నించారు.
ఈ క్రమంలోనే ఎల్లుండి అమరవీరుల స్థూపం వద్దకు వస్తానన్న ఆయన చర్చకు సీఎం రేవంత్ రెడ్డి కూడా రావాలని తెలిపారు.
అయితే నిన్న హరీశ్ రావుకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరిన సంగతి తెలిసిందే.
పంద్రాగస్టులోగా తమ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తుందని తెలిపారు.దాంతో పాటుగా తాము చెప్పిన సమయంలోపు రుణమాఫీ చేస్తే హరీశ్ రావు రాజీనామా చేయాలని రేవంత్ రెడ్డి సవాల్ చేశారు.
ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి ఛాలెంజ్ ను హరీశ్ రావు స్వీకరించారు.







