రేపు ఏపీ సీఎం జగన్ నామినేషన్..!

ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు.కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో( Pulivendula Assembly Constituency ) సీఎం జగన్ నామినేషన్ వేయనున్నారు.ఈ క్రమంలోనే రేపు ఉదయం 11.25 గంటల నుంచి ఉదయం 11.40 గంటల మధ్య సీఎం జగన్ నామినేషన్( CM Jagan Nomination ) వేయనున్నారని తెలుస్తోంది.కాగా ఈ నెల 22న జగన్ తరపున వైఎస్ మనోహర్ రెడ్డి ఒక సెట్ నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

 Ap Cm Jagan Nomination Tomorrow Details, Cm Jagan, Cm Jagan Nomination, Pulivend-TeluguStop.com

అంతకముందు పులివెందులలో వైసీపీ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొని ప్రసంగించనున్నారు.అయితే ప్రస్తుతం ఆయన ‘మేమంతా సిద్ధం’( Memantha Siddham ) పేరిట బస్సు యాత్రను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ బస్సు యాత్ర టెక్కలి నియోజకవర్గంలోని అక్కవరం భారీ బహిరంగ సభతో ముగియనుంది.సభ ముగిసిన అనంతరం సీఎం జగన్ నేరుగా విజయవాడకు వెళ్లనున్నారని సమాచారం.ఈ క్రమంలోనే రేపు కడపకు వెళ్లనున్న ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube