వీవీప్యాట్లపై సుప్రీంకోర్టు( Supreme Court ) కీలక తీర్పును వెలువరించనుంది.ఈ మేరకు ఈవీఎంలలో పోలైన ఓట్లను వీవీ ప్యాట్ స్లిప్ లతో సరిపోల్చాలని కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే.
ఈ పిటిషన్ పై ఇప్పటికే విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం ఇవాళ మరోసారి వాదనలు విననుంది.వీవీప్యాట్ మెషిన్లపై ఓటరుకు కనిపించే అద్దం స్థానంలో ఏడు సెకన్ల పాటు లైట్ వచ్చినప్పుడు మాత్రమే కనిపించే విధంగా మరో రకమైన గ్లాస్ ను ఏర్పాటు చేస్తూ 2017వ సంవత్సరంలో ఎన్నికల కమిషన్I Election Commission ) నిర్ణయం తీసుకుంది.
ఈసీ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే విధంగా ఆదేశించాలని కోరుతూ ఏడీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు తీర్పును వెలువరించనుంది.