తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.ఆంధ్రప్రదేశ్ హోమ్ శాఖామంత్రి తానేటి వనిత.
, హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జయరాం ఠాకూర్ లు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా… ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఆలయం వెలుపల హోమ్ శాఖమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ….శ్రీవారిని దర్శించుకోవడం చాల సంతోషంగా ఉందన్నారు.సీఎం జగన్ చక్కటి పాలనా అందించాలని ప్రార్ధించానన్నారు.ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.పొలిటికల్ విషయాలు తిరుమలలో మాట్లాడటం సబబు కాదన్నారు.
తాజా వార్తలు