ఒంటరిగా ఉంటే ఆ నవలలు చదువుతానన్న రెజీనా.. చిన్నచూపు చూడొద్దంటూ?

టాలెంట్ ఉన్నా ఆశించిన రేంజ్ లో సక్సెస్ ను సొంతం చేసుకోని హీరోయిన్లలో రెజీనా కెసాండ్రా( Regina Cassandra ) కూడా ఒకరు.ఈ మధ్య కాలంలో ఈ బ్యూటీ నటించిన సినిమాలేవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించడం లేదు.

 Heroine Regina Shocking Comments Goes Viral In Social Media Details Here,regina-TeluguStop.com

అయితే ఓటీటీల హవా పెరగడంతో ఈ బ్యూటీకి వెబ్ సిరీస్ లలో ఆఫర్లు వస్తున్నాయి.పలు సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కూడా రెజీనాకు ఒకింత మైనస్ అయిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Telugu Farzi, Regina, Tollywood, Web-Movie

16 సంవత్సరాల వయస్సులోనే నటిగా కెరీర్ ను మొదలుపెట్టిన ఈ బ్యూటీ కొన్ని సినిమాలలో బోల్డ్ రోల్స్ లో నటించడంతో పాటు నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ లో సైతం నటించి మెప్పించడం గమనార్హం.ఫర్జీ సిరీస్( Farzi Series ) తో తాజాగా ప్రేక్షకులను పలకరించిన ఈ బ్యూటీ లైఫ్ లో వచ్చిన ప్రతి మలుపు సంతోషాన్ని కలిగించిందని చెప్పుకొచ్చారు.అభిమానులు సెల్ఫీ అడిగితే సెల్ఫీ దిగేంత గొప్ప పని ఏం చేశానని అనిపిస్తుందని ఆమె కామెంట్లు చేశారు.ఆ ప్రేమను, అభిమానాన్ని చిన్నచూపు చూడొద్దని రెజీనా పేర్కొన్నారు.

యాంకర్ గా నా కెరీర్ మొదలైందని గుర్తింపు వచ్చిన ప్రతి మనిషికి బాధ్యతలు పెరుగుతాయని రెజీనా చెప్పుకొచ్చారు.స్పూర్తిదాయక మహిళల కథలు మరిన్ని రావాలని ఆమె పేర్కొన్నారు.

ఖాళీ సమయంలో రొమాంటిక్ నవలలు ( Romantic Novels )చదువుతానని ఆమె కామెంట్లు చేశారు.నా ఫేవరెట్ డ్రింక్ కాఫీ అని కాఫీ తాగితే కొత్త ఎనర్జీ వస్తుందని రెజీనా చెప్పుకొచ్చారు.

ఒకప్పుడు నాన్ వెజ్ ఇష్టంగా తిన్నానని పెటాలో చేరిన తర్వాత ఆ విషయంలో మారానని రెజీనా చెప్పుకొచ్చారు.

Telugu Farzi, Regina, Tollywood, Web-Movie

నా స్నేహితులు నన్ను మదర్ ఆఫ్ గ్యాంగ్( Mother of Gang ) అని పిలుస్తారని ఆమె కామెంట్లు చేశారు.నా అనుకునే వాళ్లను జాగ్రత్తగా చూసుకోవాలని నేను భావిస్తానని రెజీనా చెప్పుకొచ్చారు.నేను సైకాలజీ( Psychology )లో డిగ్రీ చదివానని మనుషులతో ఓ పట్టాన నేను కనెక్ట్ కానని ఆమె కామెంట్లు చేశారు.

ప్రతి మనిషికి వ్యక్తిత్వం, అస్తిత్వం ఉండాలని ఆమె పేర్కొన్నారు.అడుగులు పెద్దగా వేయాలే తప్ప అక్కడే ఆగిపోకూడదని రెజీనా పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube