ధడక్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే ఈమె నటించిన పలు సినిమాలు విడుదల అవుతూ ఉండగా పెద్ద ఎత్తున జాన్వీ కపూర్ పలు ఇంటర్వ్యూలలో పాల్గొని ఎన్నో ఆసక్తికరమైన విషయాల గురించి వెల్లడిస్తున్నారు.
తాజాగా తను నటించిన గుడ్ లక్ జెర్రీ సినిమా విడుదల కావడంతో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ దేవరకొండ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ఈమె విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుతూ తనపై ఉన్న అభిప్రాయాన్ని వెల్లడించారు.
విజయ్ దేవరకొండ ఒక గిఫ్టెడ్ యాక్టర్ అని, గుడ్ లుక్, సినిమాటిక్ యాక్టర్’ అంటూ పొగడ్తలతో ముంచెత్తింది.ఇకపోతే ఆయన నటించిన అర్జున్ రెడ్డి సినిమాలో ఆయన నటన ఎంతో అద్భుతంగా ఉంది అంటూ ఆయన గురించి గొప్పగా చెప్పడమే కాకుండా ఎప్పటికైనా తనతో పక్కాగా నటిస్తానని జాన్వీ ఈ సందర్భంగా వెల్లడించారు.
ఈ విధంగా జాన్వీ కపూర్ విజయ్ దేవరకొండ గురించి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఇకపోతే ఈమె నటించిన గుడ్ లక్ జెర్రీ సినిమా ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారమవుతూ మంచి టాక్ సొంతం చేసుకుంది.ఇక ఈ ముద్దుగుమ్మ కాఫీ విత్ కరణ్ టాక్ షోలో కూడా విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుతూ ఏకంగా తనతో డేట్ కి వెళ్లాలని ఉంది అంటూ సమాధానం చెప్పిన విషయం మనకు తెలిసిందే.