తెలుగు ప్రేక్షకులు దేవుళ్ళు.. హీరో యష్ వైరల్ కామెంట్స్!

కన్నడ హీరో యష్ నటించిన కేజీఎఫ్ ఈ సినిమా విడుదల అయి ప్రపంచవ్యాప్తంగా ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే.కన్నడ భాషల్లో రూపొందిన ఈ సినిమా తెలుగు హిందీ తమిళ మలయాళ భాషల్లో విడుదల అయ్యి అన్ని భాషల్లో కూడా సంచలన విజయాన్ని సాధించింది.

 Hero-yash Words Bout Telugu Audience Kannada Hero Yash, Kgf, Kgf 2, Tollywood, P-TeluguStop.com

అయితే మొదట కేవలం రెండు కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం ఈ సినిమా విడుదల తరువాత ఏకంగా 14 కోట్ల రూపాయల షేర్స్ ని రాబట్టింది.అలా మొత్తం అన్ని భాషలు కలిపి దాదాపుగా 250 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

కేజిఎఫ్ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా కేజిఎఫ్ 2 సినిమా ఎప్పుడు ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎదురు చూశారు.

అయితే ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కేజిఎఫ్ 2 సినిమా ఏప్రిల్ 14న విడుదల కాబోతోంది.

అయితే ఇప్పటికే ఈ సినిమా బుకింగ్స్ అన్ని భాషల్లో కూడా ఓపెన్ అయ్యాయి.సినిమా విడుదల తేది దగ్గర పడుతుండటంతో చిత్రబృందం క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్నారు.

తెలుగు ప్రొమోషన్స్ లో భాగంగా ఈ సినిమా హీరో యాష్ తెలుగు ప్రేక్షకుల పై చేసిన కొన్ని వ్యాఖ్యలు చేసాడు.ఈ సందర్బంగా హీరో యష్ మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాలను ప్రోత్సహించడంలో ఎప్పుడు ముందు ఉంటారు.

Telugu Kannada Yash, Kgf, Prashanth Neel, Tollywood-Movie

కేజిఎఫ్ సినిమా చాప్టర్ 1 ని అంత పెద్ద హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు తెలియచేస్తున్నాను, సినిమాని ఎలా చూడాలో తెలుగు ప్రేక్షకులకు తెలిసినంత ఎవ్వరికి తెలియదు.నేను హైదరాబాద్ లో అడుగుపెట్టగానే ఇక్కడి స్టార్ హీరోల రేంజ్ లో నాకు అభిమానులు స్వాగతం పలికారు.ఇంత అభిమానాన్ని చూపిస్తున్న మీకు ఏమి ఇచ్చి నేను ఋణం తీర్చుకోగలను.మిమల్ని ఎప్పటికి నిరాశ చెందకుండా అద్భుతమైన సినిమాలు మీకు అందించడం లో నేను నా వంతుగా కృషి చేస్తాను అని చెప్పుకొచ్చాడు కేజిఎఫ్ హీరో యష్.ఏప్రిల్ 14 విడుదల కాబోతున్న కేజిఎఫ్ 2 ఈ సినిమాపై ప్రేక్షకులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube