విజయ్ సేతుపతి లవ్ స్టోరీ ముందు ఏ సినిమా స్టోరీ పనికి రాదు..!

తెలుగు, తమిళ ఇండస్ట్రీలో విజయ్ సేతుపతి గురించి తెలియని వారంటూ ఉండరు.తనదైన శైలిలో సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

 Hero Vijay Sethupathi Love Story-TeluguStop.com

అయితే ఇండస్ట్రీలో నిలవాలి అంటే అంత సులభమైన పని కాదు.ఇక తమిళ సినిమా ఇండస్ట్రీలో మొదట చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చిన ప్రతీ చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఒక్కో మెట్టు ఎక్కుతూ తన కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న నటుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి.

ఎన్నో కష్టాలు పడి ఇండస్ట్రీలోకి ఎంటరైన ఆయనకు హీరోగా స్టార్‌డమ్ వచ్చేందుకు చాలా సమయమే పట్టిందని చెప్పాలి.

 Hero Vijay Sethupathi Love Story-విజయ్ సేతుపతి లవ్ స్టోరీ ముందు ఏ సినిమా స్టోరీ పనికి రాదు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక విజయ్ సేతుపతికి స్టార్‌డమ్ వచ్చిన తరువాత నెగిటివ్ పాత్రలను చేసేందుకు హీరోలు ఎక్కువగా ఇష్టపడరు.

కానీ విజయ్ సేతుపతి మాత్రం తన స్టార్‌డమ్‌ కంటే పాత్రకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు అందుకే తమిళ ఇండస్ట్రీలో విజయ్ సేతుపతికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.విజయ్ సేతుపతి తన హీరోయిజం, విలనిజం చూపిస్తూ ప్రతీ ఇండస్ట్రీలో ఒక నటుడు కనిపిస్తుంటాడు.

ప్రతీ దర్శకుడకి అతడో ఛాయిస్.ఎందుకంటే.

పలానా పాత్రను ఆయన మాత్రమే చేయగలడు అని దర్శకులు ‘రాసి పెట్టుకుంటారు.’ అలాంటి హీరోకాని నటుడు విజయ్ సేతుపతి.

ఆయన నవరసాలు పలికించే అద్భుతమైన నటుడు.అంతటి ప్రతిభ ఉన్న నటుడిని ఏ దర్శకుడు మాత్రం ఎందుకు వదులుకుంటారు.

విజయ్ సేతుపతి పర్సనల్ లైఫ్ ఎలా ఉందో ఒక్కసారి తెలుసుకుందామా.తమిళనాడులోని రాజపాల్యెంలో జన్మించాడు విజయ్.ఆరో తరగతి చదువుకునే నాటికి వారి కుటుంబం చెన్నైకి వలస వెళ్లింది.పదహారేళ్లప్పుడు ఏదో సినిమా ఆడిషన్స్ లో పాల్గొన్నాడు కానీ విఫలమయ్యాడు.

ఆ తరవాత సినిమా ఊసుల్ని మరచిపోయి బతుకు బాటలో ముందుకు కదిలాడు.కామర్స్ లో డిగ్రీ చదివాడు.

కుటుంబ సమస్యల కారణంగా విదేశాలకు వెళ్ళాడు.అయితే దర్శకుడు బాలూ మహేంద్ర ‘నీది ఫోటోజెనిక్ ఫేస్’ అన్న మాటల్ని గట్టిగా పట్టుకున్నాడు.

సినిమాలే జీవితంగా సాగాలని విశ్వప్రయత్నం చేశాడు.‘ఎం.కుమరన్ సన్ ఆఫ్ మహాలక్ష్మి’ చిత్రంలో బాక్సింగ్ క్రీడ వీక్షకుడిగా తెరంగేట్రం చేశాడు.

అయితే విజయ్ సేతుపతి గురించి అందరికి తెలియని విషయం ఏమిటంటే అతడు జెస్సీ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

ఇక జెస్సీ చెన్నైలోనే పుట్టి పెరిగిన మలయాళీ అమ్మాయి.విజయ్ సినిమాల్లోకి రాకముందే వీళ్లకు పెళ్లైయింది.అయితే.వీళ్ల ప్రేమ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.

విజయ్ దుబాయిలో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆన్ లైన్ పరిచయం అయింది జెస్సీ.ఆమె కూడా అక్కడే పనిచేస్తుండేది.

ఇద్దరి అభిరుచులు కలవడంతో చాటింగ్లో మునిగిపోయేవారు.కానీ పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడు ఇరుపక్షాల పెద్దలూ ఒప్పుకోలేదట.

అయినా.తీవ్రంగా ప్రయత్నించి ఆఖరుకి విజయం సాధించారు.

Telugu Jersey, Love Story Begin In Dhubai, Vijay Sethupathi, Vijay Sethupathi Love Story-Telugu Stop Exclusive Top Stories

నిశ్చితార్థం రోజునే మొదటిసారి ప్రత్యక్షంగా కలుసుకుందట ఈ జంట.ఇక సినిమాల్లో అవకాశాలు లేక అల్లాడుతున్న సమయంలో జెస్సీ అండగా నిలిచిందని తన విజయ రహస్యం ఆమేనని చెబుతుంటాడు విజయ్ సేతుపతి.వీరికి ఓ బాబు పాప ఉన్నారు.సినిమాల్లో తనదైన నటనతో సత్తా చాటుకునే విజయ్ ఆఫ్ ది స్క్రీన్ మాత్రం కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్ గా ఉంటాడు.

ఇక ఇండస్ట్రీలోకి వచ్చిన ఆరేళ్ల తరువాత తాను హీరో అయ్యానని, అప్పటి వరకు చిన్న చిన్న పాత్రలే చేసుకుంటూ వచ్చానని అన్నాడు.తాను సినిమాల్లో తిరుగుతున్నానన్న విషయం తెలుసుకుని తన భార్య ఎంతో బాధపడినట్టు చెప్పాడు.

సినిమాల్లో డబ్బులు పెద్దగా రాకపోవడంతో తమ పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందోనని తన భార్య చాలా బాధపడేదని, తన జీవితంలో చేసిన పెద్ద రిస్క్ ఇదేనంటూ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సంచలన విషయాలను ఒక్కనొక్క సమయంలో బయటపెట్టాడు విజయ్ సేతుపతి.

#VijaySethupathi #Jersey #LoveStory

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు