శ్రీయ కి హీరో రామ్ కుటుంబం ఇంత సహాయం చేసిందా..?

సినిమా ఇండస్ట్రీలో హీరోలు హీరోయిన్లు గా ఎదగాలంటే మనకంటూ తెలిసిన వాళ్ళు కొందరు ఉండాలి లేకపోతే హీరోలుగా హీరోయిన్ గా సక్సెస్ అయినప్పటికీ ఎక్కువ కాలం నిలబడ లేకపోవచ్చు.ఎందుకంటే సక్సెస్ అనేది ఒక్కసారి వస్తే మనం ఏం చేస్తున్నామో కూడా మనకు తెలియకుండానే చేస్తుంటాం ఎందుకంటే ఇండస్ట్రీలో సక్సెస్ కోసం మనం చాలా రోజులు ఎదురు చూసి ఉంటాం కాబట్టి ఒకసారి సక్సెస్ కనబడగానే మనం అనుకున్నది సాధించాము ఇంకేంటి అనుకొని సక్సెస్ స్టేటస్ ని ఎంజాయ్ చేస్తూ కెరియర్ ని బిల్డ్ చేసుకోవడం వదిలేస్తాం ఈ ప్రాసెస్ లోనే మన కెరీర్ మనకు తెలియకుండానే కింద పడిపోతుంది సరిగ్గా శ్రియా కి స్రవంతి రవి కిషోర్ లాంటి సలహాలు సూచనలు ఇచ్చే పెద్దాయన లేకపోతే ఆమె కెరియర్ కూడా ఎక్కువకాలం నిలిచేది కాదేమో ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే శ్రేయ కెరియర్లో స్రవంతి రవి కిషోర్ గారి పాత్ర చాలా గొప్పగా ఉంటుంది అదేంటో ఇప్పుడు చూద్దాం.

 Hero Ram Helped Heroine Shriya, Hero Ram, Shriya Saran, Rajinikanth, Ramoji Rao,-TeluguStop.com

శ్రేయ ఇండస్ట్రీకి రాకముందు కొన్ని ఆల్బమ్స్ లో యాక్ట్ చేసింది ఆల్బమ్స్ చూసిన రామోజీ రావు గారు ఇష్టం సినిమా కోసం శ్రేయని హైదరాబాద్ కి రప్పించారు.సరిగ్గా అదే టైం కి మాటల మాంత్రికుడు అయినా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో తరుణ్ హీరోగా స్రవంతి రవి కిషోర్ ప్రొడ్యూసర్ గా ఒక సినిమా చేయాలని చూస్తున్నారు అంతా బానే ఉంది కానీ హీరోయిన్ పాత్ర చేయడానికి ఎవరైతే బాగుంటారు అని వెతికె ప్రాసెస్ లో ఒకరోజు స్రవంతి రవి కిషోర్ గారు రామోజీ ఫిలింసిటీలో ఇష్టం సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు శ్రేయని చూశారు దాంతో అప్పుడే ఆమెతో సినిమాకు సంబంధించిన స్టొరీ డిస్కస్ చేసి హీరోయిన్ గా ఆమెతో అగ్రిమెంట్ చేయించారు ఆ సినిమానే నువ్వే నువ్వే.

అయితే శ్రేయ అప్పటికే చెన్నకేశవరెడ్డి , సంతోషం లాంటి సినిమాలకి హీరోయిన్ గా చేస్తా అని కమిట్ అయింది.అయితే నువ్వే నువ్వే సినిమా తీసిన తర్వాత శ్రేయ కి ఇండస్ట్రీకి సంబంధించి మంచిచెడులు చెప్పేవారు కెరీర్ కు సంబంధించి చూసుకునే పెద్ద వారు ఎవరూ లేకపోవడంతో స్రవంతి రవి కిషోర్ గారిని కెరీర్ గురించి ఏం చేయాలి, ఎలా చేయాలి అని సలహాలు సూచనలు తీసుకుని ఆయన చెప్పిన సలహాల ప్రకారం తన కెరీర్ నీ తాను బిల్డ్ చేసుకుంది.

అందుకే రవి కిషోర్ గారి మీద కృతజ్ఞతతోనే వైవిఎస్ చౌదరి డైరెక్షన్లో రామ్ హీరోగా వచ్చిన దేవదాస్ సినిమాలో ఐటమ్ సాంగ్ చేసింది కొత్త హీరో సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడం ఏంటి అనే డౌట్ అందరికీ వచ్చింది.

Telugu Ram, Rajinikanth, Ramoji Rao, Shriya Saran-Telugu Stop Exclusive Top Stor

కానీ రవి కిషోర్ గారు లాంటి గొప్ప మనసున్న మనిషి ఫ్యామిలీ నుంచి వస్తున్న హీరో కాబట్టి రామ్ సినిమా లో తను ఐటెంసాంగ్ చేసిందని రవి కిషోర్ గారు మా ఫ్యామిలీ ఫ్రెండ్ నాకు అంకుల్ లాంటి వారిని చాలాసార్లు చెప్పుకువచ్చింది.శ్రేయ దాదాపు దశాబ్దకాలం పాటు అగ్ర హీరోయిన్ గా వెలుగొందింది తెలుగు ఇండస్ట్రీలో అప్పటివరకు ఉన్న సీనియర్ హీరోలు, జూనియర్ హీరోలందరితో నటించిన ఏకైక హీరోయిన్ శ్రేయనే.చిరంజీవితో ఠాగూర్ లాంటి సినిమాల్లో నటించి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టారు.

హీరోయిన్ గా వేషాలు తగ్గిపోవడంతో శేఖర్ కమ్ముల తీసిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా లో ఒక మంచి క్యారెక్టర్ చేశారు.అక్కినేని నాగేశ్వరరావు నాగార్జున నాగ చైతన్య వంటి 3 జనరేషన్ ల హీరోలు కలిసి నటించిన మనం సినిమాలో నాగార్జునకు జతగా కనిపించి జనాలని మెస్మరైజ్ చేశారు.

ఇప్పుడు ప్రెస్టేజస్ గా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న త్రిబుల్ ఆర్ సినిమాలో కూడా శ్రేయ నటిస్తుంది.సౌత్ లో టాప్ డైరెక్టర్ అయినా శంకర్ డైరెక్షన్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ పక్కన శివాజీ సినిమాలో నటించి తన నట విశ్వరూపాన్ని చూపించారు.

మొత్తానికి శ్రేయ కి ఇండస్ట్రీలో స్రవంతి రవికిషోర్ లాంటి ఒక పెద్దాయన అండగా ఉండడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయం…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube